చైతూ కు అలా అయిందని నాగ్ బాధ

చైతూ కు అలా అయిందని నాగ్ బాధ

సినిమాల రిలీజ్ విషయంలో టైమింగ్ అన్నది ఇప్పుడు చాలా కీలకం అయిపోయింది. మంచి సీజన్లో రాకపోతే ఒక్కోసారి మంచి సినిమాలు కూడా అన్యాయం అయిపోతుంటాయి. అక్కినేని నాగచైతన్య చివరి సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడా అలాగే అయింది. నిజానికి ఆ సినిమా చెత్తగా ఏమీ ఉండదు. అంచనాలకు తగ్గట్లు లేకపోయినా అది మంచి సినిమానే. అయినా ఆడలేదు. ఆ సినిమా రాంగ్ టైమింగ్‌లో రిలీజవడమే ఇందుకు కారణమని అంటున్నాడు నాగ్. చైతూ కెరీర్లో ప్రత్యేకంగా నిలవాల్సిన ఆ సినిమా అలా అయిపోవడం గురించి నాగ్ ఫీలయ్యాడు.

‘‘కొన్నిసార్లు బాలేని సినిమాలు కూడా పెద్ద హిట్టయిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు బాగున్న సినిమాలు దెబ్బ తింటుంటాయి. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను సరైన టైమింగ్‌లో రిలీజ్ చేయలేదు. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ఈ సినిమాపై బాగా పడింది. ఐతే అప్పటికే చాలాసార్లు వాయిదా పడటంతో రిలీజ్ డేట్ మార్చలేకపోయారు. అలాంటి మంచి సినిమా అలా అయిపోవడం బాధ కలిగించింది’’ అని నాగ్ అన్నాడు.

చైతూ తర్వాతి సినిమాకు ఇలా కాకుండా చూసుకుంటామని నాగ్ అన్నాడు. ‘‘నా ప్రొడక్షన్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతూ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చికల్లా పూర్తవుతుంది. ఐతే రిలీజ్ విషయంలో తొందరపడం. అవసరమైతే రీషూట్లు చేస్తాం. కరెక్షన్లు ఉంటాయి. మంచి టైమింగ్ చూసి సినిమాను రిలీజ్ చేయడం ముఖ్యం. అందుకోసం ఎన్ని నెలలైనా ఎదురు చూస్తాం’’ అని నాగ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు