పవన్‌ పేరు చెప్పి వాళ్లని మేసేస్తున్నారు

పవన్‌ పేరు చెప్పి వాళ్లని మేసేస్తున్నారు

'కాటమరాయుడు' చిత్రాన్ని 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' బయ్యర్లకి నామినల్‌ రేట్లకే ఇచ్చేస్తున్నారు. 'సర్దార్‌'తో నష్టపోయిన బయ్యర్లకే ఈ చిత్రం రైట్స్‌ ఇవ్వాలనే కండిషన్‌ మీద పవన్‌ ఇది చేస్తున్నాడు. మార్కెట్‌ రేటు కంటే తక్కువకి ఇవ్వడం వల్ల ఈ చిత్రంపై పెట్టుబడి కూడా ఆచి తూచి పెడుతున్నారు.

అయితే ఈ చిత్రం హక్కులని డెడ్‌ చీప్‌గా కొట్టేస్తున్న బయ్యర్లు థర్డ్‌ పార్టీల వారికి మాత్రం తాము భారీ రేట్లు పెట్టి కొన్నట్టు కలర్‌ ఇస్తున్నారు. భారీ రేట్లకి కొన్నాం కనుక తమకి ఆ రేంజ్‌లోనే డబ్బులిచ్చి ఏరియాల వారీగా కొనుక్కోవాలని అంటున్నారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రానికి కూడా ప్రథమ శ్రేణి బయ్యర్లు నష్టపోలేదు. కేవలం ఎగ్జిబిటర్లు, థర్డ్‌ పార్టీల వాళ్లు దెబ్బ తిన్నారు. కానీ సినిమా ఫ్లాప్‌ అవడంతో నిర్మాత నుంచి నష్ట పరిహారం పొందారు.

కాటమరాయుడు రైట్స్‌ తక్కువకే కొట్టేసినా కానీ మళ్లీ దిగువ శ్రేణి మార్కెట్‌ వర్గాల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో నష్టపోయిన వారికి లాభం జరగకపోగా, బయ్యర్లు మాత్రం రెండిందాల బాగు పడిపోతున్నారు. అయితే కింది శ్రేణి బిజినెస్‌ వర్గాలు ఏంటనేది నిర్మాతకి తెలియదు కనుక రోడ్డున పడ్డ వారికి మాత్రం ఎప్పటికీ న్యాయం జరగదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు