నానికి ఎప్పుడు ఒళ్లు మండిపోతుంది?

నానికి ఎప్పుడు ఒళ్లు మండిపోతుంది?

చూడ్డానికి చాలా కూల్‌గా కనిపిస్తాడు నాని. అతడి మాటలు కూడా కూల్‌గానే ఉంటాయి. అలాగని నాకు కోపమే రాదు అనుకోవద్దు అని హెచ్చరిస్తున్నాడు నాని. షూటింగ్ స్పాట్లో మాత్రం ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు అంటున్నాడు నాని. సినిమాను సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవించాలని.. అలా చేయకపోతే తన కోపం నషాళానికి అంటుతుందని నాని చెప్పాడు.

‘‘సినిమాను పక్కన పెట్టేసి చూస్తే నేనో జీరో. ఒక చిన్న ఆఫీసులో కూడా నాకు ఉద్యోగం ఇవ్వరు. అలాంటిది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఇంతమంది అభిమానం చూపిస్తున్నారంటే కారణం సినిమానే. అలాంటప్పుడు సినిమాని ఎంతగా గౌరవించాలి? వ్యక్తిగతంగా నాకు ఎప్పుడూ కోపం రాదు. కానీ సెట్లో ఎవరైనా సినిమాను తేలిగ్గా తీసుకుంటే ఊరుకోను. ఏం పర్లేదులే అన్నట్లుగా ఎవరైనా నిర్లక్ష్యంగా మాట్లాడితే విపరీతమైన కోపం వస్తుంది. యూనిట్లో ప్రతి ఒక్కరూ కష్టపడాలి. నేనూ కష్టపడతా. ఈ విషయంలో రాజీ లేదు’’ అని నాని చెప్పాడు.

ఇక ‘జెంటిల్‌మన్’లో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో మెప్పించిన నాని.. పూర్తి స్థాయి విలన్ పాత్రకు కూడా రెడీ అని చెప్పాడు. ‘‘మామూలుగా హీరోలు నెగెటివ్ ఛాయలున్న పాత్రలు చేస్తే అవి చివరికొచ్చేసరికి మంచి పాత్రలుగా మారిపోతుంటాయి. ఐతే నేను పూర్తి స్థాయి విలన్ పాత్ర చేయాలనుకుంటున్నా. మంచి కథ దొరికితే నేను రెడీ. రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో విలన్లు చూపులతోనే భయపెడుతుంటారు. ఆ తరహా పాత్రలతో నేనూ మెప్పించగలను’’ అని నాని తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు