నాగార్జున అంత కొట్టగలడా?

నాగార్జున అంత కొట్టగలడా?

నాగార్జున రేంజ్‌ ఏంటనేది మనం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో తెలిసింది. ఊపిరి కూడా ఆ రెండు చిత్రాలకీ తీసిపోని విధంగా ఆడింది. అందుకే 'ఓం నమో వెంకటేశాయ' చిత్రానికి ముప్పయ్‌ అయిదు కోట్ల స్థాయిలో బిజినెస్‌ జరిగింది.

ఒక భక్తిరస చిత్రానికి ఇది చాలా పెద్ద అమౌంట్‌. అందులోను ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్నది అన్‌సీజన్‌లో కావడంతో ఈ ముప్పయ్‌ అయిదు కోట్లు మరింత రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్‌. అయితే నాగార్జునకి రీసెంట్‌గా పెరిగిన ఆదరణ ఈ చిత్రానికి కలిసి వస్తుందని, అన్నమయ్య సినిమా ఆరాధకులంతా ఈ చిత్రానికి క్యూ కడతారని అంచనా వేస్తున్నారు. కానీ అన్నమయ్య సినిమా టైమ్‌కి ఉన్న షాక్‌ వేల్యూ, సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ దీనికి లేవు.

అప్పుడు నాగార్జునని ఆ తరహా పాత్రలో ఎవరూ ఊహించలేదు. రాఘవేంద్రరావు నుంచి అలాంటి భక్తిరస చిత్రం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. కానీ 'ఓం నమో వెంకటేశాయ' ట్రెయిలర్‌ చూస్తేనే 'అన్నమయ్య' మళ్లీ తీసిన భావన కలుగుతోంది. దీనిపై విడుదలకి ముందు ఎలాంటి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ రాకపోవడానికి కూడా కారణమదే. దానికితోడు దీనికి పోటీగా సింగం 3 రిలీజ్‌ అవుతోంది. మరి ఇన్ని అననుకూలతలతోను నాగార్జున 35 కోట్లు రాబట్టి హిట్‌ చేయిస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు