బన్నీకి క్యాట్‌ అంతలా నచ్చేసిందా..

బన్నీకి క్యాట్‌ అంతలా నచ్చేసిందా..

బాలీవుడ్‌లో కత్రినా కైఫ్‌ను అందరూ క్యాట్‌ అని ముద్దుగా పిలిస్తే, టాలీవుడ్‌లో హాట్‌ సుందరి క్యాథరీన్‌ థ్రెసాను అందరూ క్యాట్‌ అని పిలుచుకుంటున్నారు. అయితే  ఇప్పుడు ఎక్కడ చూసినా మన స్టయిలిష్‌ హీరో అల్లు అర్జున్‌కు ఈ క్యాట్‌ ఏం రేంజ్‌లో నచ్చిందో అనే విషయం గురించే చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం బన్నీ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటిస్తున్న ఈ కత్తిలాంటి పిల్ల త్వరలోనే గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో ఒక సినిమా, అలానే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన కొరటాల శివ తీయబోయే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఈ పాత్రకు ఇప్పటికే చరణ్‌తో ఒకసారి చేసిన అమలా పాల్‌ను తీసుకుందామని  అనుకున్నారట. కాని ఇంతలో బన్నీ అడ్డుపడి, అమలా కేవలం హోమ్లీ గాళ్‌లాగా ఉంటుంది, మీకు క్యాట్‌ అయితే కత్తిలాగా సరపోతుందని సలహా ఇచ్చాడట.

ఇంకేముంది, బన్నీ మాటకు గౌరవమిచ్చే చరణ్‌, క్యాట్‌నే తీసుకుందామని నిర్మాత గణేష్‌కు సెలవిచ్చాడు. ప్రస్తుతం పైసా సినిమాలో కూడా నటిస్తున్న క్యాథరీన్‌ త్రెసా, చూస్తుంటే త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు