చిరంజీవి ముందు పవన్‌ కూడా దిగదుడుపే

చిరంజీవి ముందు పవన్‌ కూడా దిగదుడుపే

చిరంజీవికి సంబంధించిన వేడుకలకి వెళ్లి 'పవన్‌కళ్యాణ్‌' నినాదాలతో హోరెత్తించిన అభిమానులపై నాగబాబు విరుచుకుపడ్డ సంగతి గుర్తుండే ఉంటుంది. ''చిరంజీవి ఫీల్డులో లేక కానీ, ఆయనే కనుక 150వ చిత్రం చేస్తే మళ్లీ ఆయనే నంబర్‌ వన్‌. ఆయన కాకుండా నంబర్‌వన్‌లు ఎవరూ లేరిక్కడ'' అంటూ నాగబాబు పేర్కొంటే చాలా మంది నవ్వుకున్నారు.

అన్నయ్య మీద ప్రేమతో నాగబాబు రియాలిటీ గుర్తించడం లేదని, చిరంజీవి అనే గతమే తప్ప మళ్లీ ఆయన నుంచి మెగా మ్యాజిక్‌ కష్టమని అనుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్‌ అభిమానులయితే మెగా ఫ్యామిలీ అంటే పవర్‌స్టారే తప్ప ఇంక ఏ స్టారూ లేడని అనేసారు. అయితే నాగబాబు జోస్యమే నిజమయింది. నూట యాభైవ చిత్రంతోనే చిరంజీవి తన సత్తా ఏంటో చూపించారు. ఇంతవరకు పవన్‌కళ్యాణ్‌కి, మహేష్‌కి, ఎన్టీఆర్‌కి సాధ్యం కాని వంద కోట్ల షేర్‌ని 'ఖైదీ నంబర్‌ 150'తో సాధించారు. బాహుబలి లాంటి ప్రత్యేక చిత్రం తప్ప మరే సాంఘిక చిత్రం ఇంతవరకు వంద కోట్ల షేర్‌ సంపాదించలేదు.

నాగబాబు ఆవేశంలో మాట్లాడినా కానీ చిరంజీవి స్టార్‌డమ్‌పై ఆయనకున్న నమ్మకమైతే అబద్ధం కాలేదు. సర్దార్‌తో డిజప్పాయింట్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌ 'కాటమరాయుడు'తో ఆన్సర్‌ ఇస్తాడనే కాన్ఫిడెన్స్‌ అతని అభిమానుల్లో కనిపించడం లేదు. మరి పవన్‌ అంచనాలని మించిపోతాడా లేక త్రివిక్రమ్‌ సినిమా వచ్చే వరకు అన్నయ్య రికార్డుల జోలికి వెళ్లడా అనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English