అమ్మడు వాట్‌ ఏ కుమ్ముడు

అమ్మడు వాట్‌ ఏ కుమ్ముడు

చరణ్‌, సుకుమార్‌ సినిమా చేజారిందని అనుపమ అంతగా బాధ పడాల్సిన పని లేదు. మైత్రి మూవీ మేకర్స్‌ వాళ్లు అన్నట్టు ఇవాళ కాకపోతే రేపయినా ఆమె ఏదో ఒక పెద్ద సినిమా చేయాల్సిందే. యూత్‌లో పిచ్చ పాపులారిటీ సంపాదించిన అనుపమ ఓన్లీ టాలీవుడ్‌లోనే కాదు, మలయాళ, తమిళ చిత్రాల్లోను యమ బిజీగా వుంది.

ప్రేమమ్‌తో తమిళంలో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన అనుపమ, తమిళంలో 'కోడి'తో విజయాన్ని అందుకుంది. ఇంతవరకు ఆమె నటించిన సినిమా ఫెయిలవడం జరగలేదు. అన్ని భాషల్లోను వరుసగా ఆరు విజయాలు అందుకున్న అనుపమ తెలుగులో 'శతమానం భవతి' చిత్రంతో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది.

చిన్న నిర్మాతలు అందరూ ఆమెతోనే సినిమాలు చేయాలని ఎగబడుతున్నారు. అనుపమ వుంటే హిట్టు గ్యారెంటీ అనే నమ్మకం ఏర్పడడంతో ఆమెకి డబుల్‌ రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికి కూడా సై అంటున్నారు. చరణ్‌ సినిమా కన్‌ఫర్మ్‌ అయి ఉంటే అనుపమ వెంటనే సూపర్‌స్టార్‌డమ్‌పై కన్నేసి ఉండేది. కాస్త డిలే అవుతుందేమో కానీ త్వరలోనే ఆమెకి ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. ప్రస్తుతం అన్ని భాషల్లోను ఈ అమ్మడు కుమ్ముడు ఆ రేంజ్‌లో వుంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English