వరుణ్‌, చిరు.. నాగబాబు చాలా చెప్పాడు

వరుణ్‌, చిరు.. నాగబాబు చాలా చెప్పాడు

‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగబాబు నాలుగు మాటలు మాట్లాడితే.. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ నలభై మాటలు మాట్లాడాడు. వర్మ తనదైన శైలిలో నాగబాబు గాలి తీసే ప్రయత్నం చేశాడు. నాగబాబు తిరిగి కౌంటర్ వేయకపోవడంతో అప్పటికి వర్మదే పైచేయి అయింది. ఐతే కొంచెం లేటుగా ఇప్పుడు నాగబాబు వర్మకు రివర్స్ కౌంటర్లు ఇచ్చాడు. ఐతే ఈసారి నాగబాబు స్వరం మారింది. ఆ రోజు లక్షల మంది అభిమానుల్ని చూసి ఎమోషన్ తెచ్చుకుని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించిన నాగబాబు.. ఈసారి ఓ ఇంటర్వ్యూలో కూర్చుని కూల్‌గా మాట్లాడాడు. వర్మతో పాటు.. యండమూరి మీద తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.

ముందుగా యండమూరి గురించి స్పందిస్తూ.. ఆయన చరణ్‌ను ఉద్దేశించి వాడు వీడు అనే పదాలు వాడాడని.. ఆయన ఆప్యాయతతో ఆ పదాలు వాడి ఉంటే తాను పట్టించుకునేవాడిని కాదని.. కానీ అతణ్ని కించపరచడానికే ఆ పదాలు వాడటంతో తనకు కోపం వచ్చిందని నాగబాబు చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు యండమూరితో మంచి సంబందాలే ఉన్నాయని.. ఆయన్ని గురువు గారూ అని పిలుస్తానని వెల్లడించాడు.

ఇక వర్మ గురించి స్పందిస్తూ.. అతను ఐదేళ్లుగా మెగా ఫ్యామిలీ మీద రాళ్లేస్తున్నాడన్నాడు. తన అన్నయ్యను.. కుటుంబ సభ్యుల్ని కించపరిస్తే తాను మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతానన్నాడు. తాను చిరంజీవిలో 0.01 పర్సంటే అని వర్మ వ్యాఖ్యానించాడని.. నిజానికి తాను తన అన్నయ్యతో పోలిస్తే 0 పర్సంటే అని నాగబాబు వ్యాఖ్యానించాడు. తాను తన అన్నయ్య మీద ఆధారపడుతున్నందుకు బాధేమీ లేదని కూడా అన్నాడు. వర్మ అన్నట్లు పీఆర్పీ వైఫల్యానికి తనదే బాధ్యత అని అంగీకరిస్తానన్నాడు.

పార్టీ పెట్టమని అన్నయ్యకు సలహా ఇచ్చిన వాళ్లలో తాను కూడా ఒకడినన్నాడు. వర్మను చూస్తే చిన్న పిల్లాడి లాగా అనిపిస్తాడని.. నా నుంచి సలహాలు తీసుకోవద్దని వరుణ్‌కు సలహా ఇచ్చాడని.. నిజానికి వరుణ్‌కు తానేమీ సలహాలే ఇవ్వనని.. ఏదైనా తనతో చర్చిస్తే అభిప్రాయం మాత్రమే చెబుతానని నాగబాబు తెలిపాడు. వర్మ, యండమూరిల మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన భాష విషయంలో మాత్రమే అన్నయ్య అభ్యంతరం చెప్పాడని.. తన ఫీలింగ్స్ మాత్రం కరెక్టే అన్నాడని నాగబాబు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English