చిరు డ్యాన్సుల వెనక ఏఎన్నార్!

చిరు డ్యాన్సుల వెనక ఏఎన్నార్!

డ్యాన్సుల్లో సుప్రీం చిరంజీవి. ఆయన తెరపై స్టెప్పులేస్తే చాలు... అందరూ కళ్లప్పగించుకుని చూడాల్సిందే. నవతరం హీరోల్లోనూ ఎంతోమంది చిరు డ్యాన్సులను స్పూర్తిగా తీసుకుని ఎదిగారు. అయితే చిరంజీవి మాత్రం `నాకు డాన్సుల్లో ఆదిగురువు ఏఎన్నార్` అంటున్నారు. ``కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా....  అంటూ ఆయన తెరపై హొయలు పోవడాన్ని ఇప్పుడు చూసినా నాకు ఒళ్ళు పులకరించిపోతుంటుంది. ఆయన డాన్సులను స్పూర్తిగా తీసుకుని నేను స్టెప్పులేశాను`` అన్నారు చిరంజీవి.  

శుక్రవారం రాత్రి  హైదరాబాద్ లో అక్కినేని 90వ జన్మదిన వేడుకలు జరిగాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ``నేను గర్భంలో ఉన్నప్పుడే నాగేశ్వర రావుకి అభిమానిని. మా అమ్మ ఆయనకి పెద్ద అభిమాని. నేను కడుపులో ఉన్నప్పుడు ఏఎన్నార్ నటించిన `అర్థాంగి` సినిమాని చూశారట. అలా ఆయనపై అభిమానం నాకు  అప్పుడే కలిగినట్టుంది`` అన్నారు. నాగార్జున మాట్లాడుతూ.... ``నాన్నతో కలిసి `మనం` సినిమాలో నటిస్తున్నాను. మా కంటే ఆయన హుషారుగా పనిచేస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది`` అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు