బాలయ్యా.. కొంచెం చూస్కోవయ్యా

బాలయ్యా.. కొంచెం చూస్కోవయ్యా

‘నరసింహనాయుడు’ తర్వాత దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్టు లేక ఇబ్బంది పడ్డాడు నందమూరి బాలకృష్ణ. అలాంటి స్థితిలో ‘సింహా’ ఆయన కెరీర్‌కు ఊపిరి పోసింది. ఆ సమయానికి వసూళ్ల పరంగా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఊపులో బొయపాటి యంగ్ డైరెక్టర్లతో ఇలాంటి హిట్ సినిమాలే చేస్తాడులే అనుకుంటే.. ఔట్ డేట్ అయిపోయిన సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణరావుతో ‘పరమవీర చక్ర’ చేశాడు బాలయ్య. ఈ సినిమా మొదలైనపుడే ఇది ఆడే సినిమా కాదన్న ఫీలింగ్ జనాలకు కలిగింది. నందమూరి అభిమానుల నుంచి ఈ సినిమా విషయంలో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కానీ బాలయ్య మాత్రం అదేమీ పట్టించుకోకుండా సినిమా చేసేశాడు. ఫలితం ఏంటో తెలిసిందే.

ఇక వర్తమానంలోకి వస్తే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఊపులో ఉన్నాడు బాలయ్య. దీని తర్వాత ఆయన కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రైతు’ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు హోల్డ్‌లో ఉంది. ఈ లోపు బాలయ్య వరుసగా కథలు వింటున్నాడు. తాజాగా ఆయన విన్న కథ తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్‌దట. ఆ కథ నచ్చేసి.. సినిమా చేయడానికి ప్రిపేరైపోతున్నాడట బాలయ్య. ఐతే గత కొన్నేళ్లలో రవికుమార్ ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్లెవరూ ఆయనతో బాలయ్య సినిమా చేయడాన్ని ఇష్టపడరు.

రజినీకాంత్ ‘లింగా’తో పాటుగా చాలా ఏళ్ల నుంచి రవికుమార్ ఫ్లాపులే ఇచ్చాడు. ఆయనతో తమిళ స్టార్ హీరోలే పని చేయడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి స్థితిలో బాలయ్య ఓకే అన్నాడంటే అతి సరైన నిర్ణయం అనిపించుకోదేమో. మాంచి ఊపులో ఉన్న టైంలో బాలయ్య తన తర్వాతి సినిమా ఎవరితో చేయాలనే విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English