ప్రగ్యా నూ వదల్లేదా రాఘవేంద్రా...

ప్రగ్యా నూ వదల్లేదా రాఘవేంద్రా...

చేసిన సినిమాలు తక్కువ అయిన ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ అయిపోయి అమ్మడి తర్వాతి చిత్రం కోసం జనాలు వెయిట్ చేయిస్తున్న అందం ప్రగ్యా జైస్వాల్ సొంతం. కంచెతో తానేంటో చెప్పేయటమే కాదు.. వరుస అవకాశాల్ని కొల్లగొట్టేసింది. ఈఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. ఆ సిరీస్ లో మొదటగా రానుంది నాగ్ – రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’.

గ్లామర్ ఒలకబోసేసి.. అవకాశాల్ని కుమ్మేయాల్సిన టైంలో ఇలా భక్తిరస చిత్రాల్లో నటిస్తే ఎలా? అన్న డౌట్ చాలామందికి వస్తున్నా.. ఏం ఫర్లేదు.. కమర్షియల్ సినిమాల్లో ఉండే హంగులు అధ్యాత్మిక చిత్రంలో కనిపిస్తాయని చెబుతోంది. వెంకటశాయతో తనకు మంచి పేరునే కాదు.. అవకాశాల్ని తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతోంది.

కంచెలో సంప్రదాయబద్ధంగా కనిపించి మనసుల్ని దోచేసిన ప్రగ్యా.. వెంకటేశాయలోనూ ఆ మేజిక్ కంటిన్యూ కావటం ఖాయమని చెబుతోంది. అంత నమ్మకం ఎలా అంటే..తన పాత్ర ఆ రీతిలో ఉంటుందని చెబుతున్న ప్రగ్యా.. భక్తిరస చిత్రమే అయినా.. రాఘవేంద్రరావు సిగ్నేచర్ స్టైల్.. పళ్లు.. పూలతో అదరగొట్టేశారని.. ఒక పాటలో అవన్నీ కలిపిస్తాయంటూ.. ఊరించేస్తోంది.సినిమా ఏదైనా.. తాను అమితంగా ప్రేమించే పూలు.. పండ్లను వదిలిపెట్టని రాఘవేంద్రరావు.. వెంకటేశాయలో ప్రగ్యాను ఏంతలా చూపిస్తారన్నది మరికొద్దిరోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు