ఎన్టీఆర్.. స‌ర్ప్రైజింగ్ ట్వీట్‌

ఎన్టీఆర్.. స‌ర్ప్రైజింగ్ ట్వీట్‌

సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఏమీ ఉండ‌దు జూనియ‌ర్ ఎన్టీఆర్. ట్విట్ట‌ర్లో చేరి ఎనిమిదేళ్ల‌యినా.. ఇంత కాలంలో అత‌ను చేసిన ట్వీట్లు 250 కూడా దాట‌లేదు. నెల‌కోసారి ఒక ట్వీట్ వేయ‌డం కూడా క‌ష్ట‌మే. చివ‌ర‌గా బాబాయి సినిమా ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ గురించి ట్వీట్ చేసిన ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఎన్టీఆర్.. తాజాగా మ‌రో స‌ర్ప్రైజింగ్ ట్వీట్ చేశాడు.

తెలుగు వాళ్ల‌కు అంత‌గా నోట‌బుల్ కాని బాలీవుడ్ న‌టుడు విద్యుత్ జ‌మాల్ హీరోగా న‌టించిన సినిమా గురించి రెస్పాండ‌య్యాడు తార‌క్. ‘‘నా ప్రియ‌మైన స్నేహితుడు విద్యుత్ జ‌మాల్ హీరోగా న‌టించిన ‘క‌మాండో-2’ తెలుగులో వ‌స్తోంది. అత‌డికి ఆల్ ద బెస్ట్’’అని ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.

విద్యుత్ జ‌మాల్ ఎన్టీఆర్‌తో క‌లిసి రెండు సినిమాలు చేశాడు. ఒక‌టి శ‌క్తి.. ఇంకొక‌టి ఊస‌ర‌వెల్లి. ఈ రెండు సినిమాలూ ఫ్లాప‌వ‌డంతో జ‌నాల‌కు అత‌ను పెద్ద‌గా గుర్తు లేకుండా పోయాడు. ఐతే ఎన్టీఆర్‌కు మాత్రం అత‌డితో మంచి అనుబంధం ఉంద‌ని ఈ ట్వీట్‌తో అర్థ‌మైంది. తెలుగులో చేసిన సినిమాలు ఆడ‌క‌పోయినా.. త‌మిళంలో మురుగదాస్ మూవీ ‘తుపాకి’లో మెయిన్ విలన్ పాత్రలో అదరగొట్టేసి మంచి పేరు సంపాదించాడు విద్యుత్‌.

 బాలీవుడ్లో మూడేళ్ల కింద‌ట అత‌ను చేసిన ‘కమాండో’ ప‌ర్వాలేద‌నిపించింది. దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు క‌మాండో-2 చేశాడు. ‘హార్ట్ అటాక్’ భామ ఆదా శర్మ ఇందులో కథానాయికగా నటించడం విశేషం. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసేకమాండో కథ ఇది.  విద్యుత్ జ‌మాల్ యాక్ష‌న్ విన్యాసాలే ట్రైల‌ర్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. దేవేన్ భోజాని దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు