ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి హ్యాండిచ్చేశాడా?

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి హ్యాండిచ్చేశాడా?

రొటీన్ మాస్ మ‌సాలా సినిమాల‌కు విరామం ఇచ్చి ‘నేను శైల‌జ’ లాంటి భిన్న‌మైన సినిమా చేయ‌డం ద్వారా గాడిలో ప‌డ్డ‌ట్లే క‌నిపించాడు రామ్. కానీ ‘హైపర్‌తో మ‌ళ్లీ బోల్తా కొట్టేశాడు. దెబ్బ‌కు త‌ర్వాత ఏ సినిమా చేయాలో తెలియ‌ని అయోమ‌యంలో ప‌డిపోయాడు. ‘హైప‌ర్’ రిలీజై నాలుగు నెల‌లు దాటుతున్నా అత‌డి త‌ర్వాతి సినిమాపై క్లారిటీ రాలేదు. ఐతే ఇప్పుడిప్పుడే తెర‌లు వీడిపోతున్నాయి. రామ్ నెక్స్ మూవీపై స్ప‌ష్ట‌త వ‌స్తోంది.

‘నేను శైల‌జ‌’తో త‌న‌కు హిట్టిచ్చిన కిశోర్ తిరుమ‌ల‌తోనే రామ్ మ‌ళ్లీ ప‌ని చేయ‌బోతున్నాడ‌ట‌. రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్‌తో పాటు మ‌ల్టీ డైమ‌న్ష‌న్ ఫిలిమ్స్ అధినేత రామ్ మోహ‌న్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌.

‘ఎందుకంటే ప్రేమంట‌’తో త‌న‌కు పెద్ద ఫ్లాప్ ఇచ్చిన క‌రుణాక‌ర‌న్‌తోనే త‌న త‌ర్వాతి సినిమా చేయాల‌నుకున్నాడు రామ్. అనిల్ రావిపూడితో ప‌ని చేసే అవ‌కాశం మిస్స‌య్యాక క‌రుణాక‌రన్ క‌థ‌కే ఓటేశాడు. ఐతే ఎందుకంటే ప్రేమ‌తో పాటు త‌ర్వాత క‌రుణాక‌రన్ తీసిన ‘చిన్న‌దాన నీకోసం’ కూడా ఫ్లాపే. దీంతో రామ్‌ను చాలామంది హెచ్చ‌రించారు. ‘హైప‌ర్’ తేడా కొట్టేసిన నేప‌థ్యంలో రామ్ కూడా కొంచెం భ‌య‌ప‌డ్డ‌ట్లున్నాడు.

వెంకీతో చేయాల్సిన సినిమా ప‌క్క‌కు వెళ్లిపోయిన నేప‌థ్యంలో కిశోర్‌తోనే సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఐతే కరుణాక‌ర‌న్ సినిమా పూర్తిగా ఆగిపోలేద‌ని.. కిశోర్ సినిమా అయ్యాక మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఎలాగూ అవ‌కాశాల్లేవు కాబ‌ట్టి క‌రుణాక‌ర‌న్ అలిగి రామ్‌కు టాటా చెప్పే అవ‌కాశం లేదు. ఈ లోపు స్క్రిప్టు మ‌రింత బాగా తీర్చిదిద్దుకునే అవకాశం కూడా అత‌డికి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు