బాలయ్యను హ్యాండిల్‌ చేయగలడా!

బాలయ్యను హ్యాండిల్‌ చేయగలడా!

'గౌతమిపుత్ర శాతకర్ణి'గా అద్భుతమైన అభినయంతో అలరించిన నందమూరి బాలకృష్ణ ఇకపై అన్నీ వైవిధ్యభరిత చిత్రాలే చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' చేద్దామని అనుకుంటున్నారు. అయితే అందులోని ఒక కీలక పాత్రకి అమితాబ్‌బచ్చన్‌ ఓకే అన్నట్టయితేనే రైతు చేస్తానంటూ బాలకృష్ణ కండిషన్‌ పెట్టారు.

ఇప్పుడు బిగ్‌ బిని ఒప్పించే పనిలో కృష్ణవంశీ బిజీ అయ్యాడు. ఇదిలావుంటే బాలకృష్ణ వేరే కథలు కూడా వింటూనే వున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ ఇటీవలే బాలయ్యని కలిసి ఒక కథ వినిపించారట. ఆయన చెప్పిన లైన్‌ బాలయ్యకి నచ్చిందని, కథా విస్తరణ చేయమని చెప్పారని సమాచారం. రైతు కంటే ముందుగా ఈ చిత్రం పట్టాలెక్కినా ఎక్కవచ్చునని అంటున్నారు.

రజనీకాంత్‌తో 'లింగా' తీసిన రవికుమార్‌ దాంతో ఫెయిలైనప్పటికీ సీనియర్‌ హీరోలని హ్యాండిల్‌ చేయడంలో తన ప్రత్యేకతని చాలాసార్లు చాటుకున్నారు. రజనీకాంత్‌, కమల్‌తో తరచుగా సినిమాలు తీసే రవికుమార్‌ మరి బాలయ్యని ఏ తరహా పాత్రలో చూపించాలని అనుకుంటున్నారో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు