మెగాస్టార్ కు ఆ హీరో పై చాలా ప్రేమ వుంది

మెగాస్టార్ కు ఆ హీరో పై చాలా ప్రేమ వుంది

చిన్న చిన్న సహాయ పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత కొంచెం కీలక పాత్రలు చేసి.. ఆపై ‘ప్రస్థానం’లో విలన్ పాత్రలో అదరగొట్టి.. చివరగా హీరోగా అరంగేట్రం చేసి సక్సెస్ అయిన నటుడు శర్వానంద్. అతడి రేంజ్ ఏంటన్నది పక్కనబెడితే దాదాపుగా అతడి కెరీర్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను పోలి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. చిరు కుటుంబానికి శర్వా ఆత్మీయుడు. చిరు తనయుడు రామ్ చరణ్‌తో శర్వా కలిసి చదువుకున్నాడు. వాళ్ల కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగాడు. సినిమాల వైపు శర్వా ప్రయాణం కూడా చిరుతోనే మొదలైంది. ఆయనతో కలిసి థమ్సప్ యాడ్ చేయడమే కాక.. కెరీర్ తొలి నాళ్లలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో ఒక కీలక పాత్ర కూడా చేశాడతను. ఈ నేపథ్యంలో శర్వాతో తన అనుబందం గురించి ‘శతమానం భవతి’ సక్సెస్ మీట్లో చిరు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

‘‘శర్వా మా చరణ్ స్నేహితుడు. మా ఇంట్లో పెరిగిన అబ్బాయి. కానీ ఎప్పుడూ చాలా కామ్‌గా ఉండేవాడు. హీరో మెటీరియల్ అనిపించేది కానీ.. అతడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో అనే డౌట్ ఉండేది. ఐతే తను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు చరణ్ చెబితే.. నేను చేయాలనుకున్న థమ్సప్ యాడ్లో నాతో కలిసి కనిపించే కుర్రాడి పాత్రకు అవకాశమిచ్చాం. మీతో కలిసి కెమెరా ఫేస్ చేస్తానంటే అంత కంటే ఏం కావాలంటూ శర్వా వెంటనే రంగంలోకి దిగాడు. అలా శర్వానంద్ అరంగేట్రం నాతోనే జరిగింది. నాకు నా కొడుకు సక్సెస్ ఎంతో శర్వానంద్ సక్సెస్ కూడా అంతే. శతమానం భవతి సినిమాలో శర్వా చేసిన పాత్రకు సంబంధించిన యాడ్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి’’ అని చిరు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు