జోరు మీదున్న మెగాస్టార్

జోరు మీదున్న మెగాస్టార్

తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన సత్తా ఏమిటన్నది ఖైదీ నంబరు 150తో చెప్పటం తెలిసిందే. రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్స్ ఫీస్ దుమ్ము దులిపిన అన్నయ్యతో.. మెగా అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. తన రీఎంట్రీకి అభిమానులు ఆదరిస్తారన్న విషయంలో చిరుకు నమ్మకం ఉన్నప్పటికీ.. ఆ అభిమానం ఈ రేంజ్లో ఉంటుందన్నది ఆయన కూడా ఊహించలేదన్నది నిజం.

సినిమాలు వదిలేసి.. పాలిటిక్స్ లోకి వచ్చేసి.. అప్ అండ్ డౌన్స్ చూసిన వేళలో.. మెగాస్టార్ రీఎంట్రీ ఎంత సక్సెస్ ఫుల్ గా ఉంటుందన్న విషయంపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినా అవి ఉత్తవనే విషయాన్ని తేల్చేశారు. ఖైదీతో అదిరిపోయే సక్సెస్ ను సొంతం చేసుకున్న చిరు.. తన తర్వాతి చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ లోనే తీసేందుకు ఓకే చెప్పేయటం తెలిసిందే.

ఒకటి తర్వాత ఒక్కొ చిత్రాన్ని ఒప్పుకుంటూ మహా పొదుపుగా వ్యవహరిస్తున్న ఇప్పటి అగ్రహీరోల తీరుకు భిన్నంగా చిరు వ్యవహరిస్తున్నారు. తన 151వ చిత్రం గురించి ఒక కంక్లూజన్ కు వచ్చిన ఆయన తాజాగా తన 152వ చిత్రంలోనూ క్లారిటీకి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. రానున్న రెండు సంవత్సరాల వ్యవధిలో తాను తొమ్మిది సినిమాల్ని నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత ఆశ్వనీదత్ చేసిన ప్రలైన కటన చూస్తే.. చిరు చిత్రం పక్కాగా ఉన్నట్లు చెబుతున్నారు.

తన తొమ్మిది చిత్రాల్ని అగ్రహీరోలతో నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. వీరిలో చిరు..నాగార్జున.. మహేశ్.. ఎన్టీఆర్ లాంటి వారితో తన సినిమాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రకటన చూస్తే.. చిరు 152వ సినిమా అశ్వనీదత్ దే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. చిరు.. తన 152వ సినిమా విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English