ఖైదీని ఆ రెండూ అక్కడ దెబ్బకొట్టాయి

ఖైదీని ఆ రెండూ అక్కడ దెబ్బకొట్టాయి

వంద కోట్ల షేర్‌కి చేరువ అవుతోన్న ఖైదీ నంబర్‌ 150తో బయ్యర్లంతా హ్యాపీనే. అన్ని ఏరియాల్లోను లాభాల్లోకి లేదా బ్రేక్‌ ఈవెన్‌ జోన్‌లోకి వచ్చిన ఖైదీ ఒక్క నైజాంలో మాత్రం అండర్‌ పర్‌ఫార్మ్‌ చేస్తోంది. ఈ ఏరియాలో పదహారు రోజులకి 18 కోట్ల 35 లక్షల రూపాయల షేర్‌ మాత్రమే వసూలు చేసింది. ఈ ఏరియాని ఒక పంపిణీదారునితో కలిసి నిర్మాత (త్రూ గీతా ఆర్ట్స్‌) స్వయంగా రిలీజ్‌ చేసారు.

ఇరవై ఒక్క కోట్ల రూపాయల ఆఫర్‌ని కాదని ఇక్కడ స్వయంగా విడుదల చేసుకున్నారు. అంటే వేల్యుయేషన్‌ ప్రకారం నైజాం నుంచి నిర్మాతకి ఇరవై ఒక్క కోట్లు వచ్చి వుండాలి. వాటిని కాదనుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజీలో మరో పంపిణీదారునితో స్వయంగా విడుదల చేసుకున్నారు కనుక ఇక లాభనష్టాల గొడవ వుండదు. కాకపోతే మినిమమ్‌ ఇరవై ఒక్క కోట్లు వస్తాయని అంచనా వేసిన ఏరియాలో ఇప్పటికి పద్ధెనిమిది కోట్ల చిల్లర వచ్చింది. ఈ ఆదివారం తర్వాత పెద్దగా వచ్చేదేమీ వుండదు కనుక ఇరవై ఒక్క కోట్ల లోపులోనే బిజినెస్‌ ముగుస్తుంది.

అన్ని ఏరియాల్లో అదరగొట్టిన ఖైదీ ఒకప్పటి చిరంజీవి అడ్డా అయిన నైజాంలో ఎందుకని అండర్‌ పర్‌ఫార్మ్‌ చేసింది? దీనికి కారణం గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి అని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలకీ కలిపి ఇంతవరకు నైజాంలో పదహారు కోట్ల వరకు షేర్‌ వచ్చింది. అంటే ఖైదీ బిజినెస్‌ చాలా వరకు డివైడ్‌ అయిపోయింది.

ఇవి రెండూ మల్టీప్లెక్సుల్లో కూడా బాగా ఆడడంతో ఖైదీ నంబర్‌ 150కి థియేటర్ల పరంగా, షోస్‌ పరంగా కూడా అడ్వాంటేజ్‌ లేకుండా పోయింది. ఫలితంగా ఓవరాల్‌ బిజినెస్‌ షేర్‌ అయిపోయి ఖైదీ ఇక్కడ అండర్‌ పర్‌ఫార్మ్‌ చేసింది. ఓవర్సీస్‌లో కూడా ఖైదీకి సిమిలర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎదురైంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు