ఎన్టీఆర్‌ బుక్‌ అయిపోయేవాడు!

ఎన్టీఆర్‌ బుక్‌ అయిపోయేవాడు!

జల్లికట్టు గురించి ట్వీట్‌ చేసి, ఏపీ స్పెషల్‌ స్టాటస్‌ గురించి ట్వీట్‌ చేయకపోవడంతో మహేష్‌బాబుని 'ద్రోహి'గా అభివర్ణించాడు రాంగోపాల్‌వర్మ. మహేష్‌ స్వార్ధ పరుడనే ముద్ర వేసి సోషల్‌ మీడియాలో చాలానే రచ్చ జరిగింది. టాప్‌ సెలబ్రిటీల్లో పాలిటిక్స్‌కి సంబంధం లేని వారిలో ఈ విధంగా బుక్‌ అయిపోయింది మహేష్‌ ఒక్కడే.

జల్లికట్టుపై మహేషే ముందుగా మన వైపు నుంచి స్పందించాడు. ఆ తర్వాత పవన్‌ కూడా ట్వీట్లు వేసినా, అతను రాజకీయాల్లో వున్నాడు కనుక అతని ఒపీనియన్‌ గురించి పెద్ద చర్చ జరగలేదు. కానీ మహేష్‌ ఎందుకు ట్వీట్‌ చేసాడంటూ గుచ్చి గుచ్చి ఆరాలు తీసారు. తన సినిమా తమిళంలో రిలీజ్‌ అవుతోంది కనుక ఈ అవకాశాన్ని వాడుకున్నాడంటూ నిందలు వేసారు. ఇదే మాట వర్మ కూడా అనేసాడు.

మహేష్‌తో పాటు ఎన్టీఆర్‌ కూడా ఈ రొంపిలో చిక్కుకునే వాడేనంట. జల్లికట్టుపై సెలబ్రిటీస్‌ స్పందిస్తూ వుండే సరికి తాను కూడా వారికి సపోర్ట్‌ ఇద్దామనుకున్నాడట. కానీ మహేష్‌కి ఎదురవుతోన్న అనుభవం చూసి అతడిని అలర్ట్‌ చేసారని, ఈలోగా ఆర్డినెన్స్‌ కూడా వచ్చేయడంతో ఇక ట్వీట్‌ చేసి ఉపయోగం లేదనిపించి మానుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందులో వాస్తవం ఎంతనేది తెలియదు కానీ అప్పుడు ట్వీట్‌ చేసినట్టయితే ఏపీ స్పెషల్‌ స్టాటస్‌ గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడాల్సి వచ్చేది. అప్పుడు చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా వెళుతున్నాడని అనేవారు. ఒకవేళ సైలెంట్‌గా ఉంటే, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్‌ పోరాడితే, జూ. ఎన్టీఆర్‌కి అదంటే లెక్క లేదని విమర్శించేవారు. ఏదేమైనా మహేష్‌ అనుభవంతో ఇకపై సెన్సిటివ్‌ విషయాలపై తమ ఒపీనియన్‌ వాయిస్‌ చేయడం మీద సెలబ్రిటీస్‌ ఒకటికి పదిసార్లు తర్కించుకోవడం గ్యారెంటీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు