బన్నీ భారీ స్కెచ్చే రెడీ చేస్తున్నాడు

బన్నీ భారీ స్కెచ్చే రెడీ చేస్తున్నాడు

ఎన్టీఆర్‌, చరణ్‌ ఇక్కడ తమకున్న ఫాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకోవడం కోసం ప్రయోగాల బాట పడుతోంటే, అల్లు అర్జున్‌ తన మార్కెట్‌ని పెంచుకునే స్కెచ్‌లు రెడీ చేసుకుంటున్నాడు. త్వరలోనే తమిళం, తెలుగులో ద్విభాషా చిత్రం చేయబోతున్న బన్నీ కోసం ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పని ప్రారంభమైంది. లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తే తమిళనాడు జనం ఖచ్చితంగా తనని ఆదరిస్తారని బన్నీ ఆశిస్తున్నాడు.

అయితే ఆ ఒక్క సినిమా చేసి ఊరుకుంటే తమిళనాడులో మార్కెట్‌ సాలిడ్‌గా ఏర్పడదు. వెంటవెంటనే ద్విభాషా చిత్రాలు చేస్తే తప్ప మార్కెట్‌లో పూర్తిగా స్థిరపడడం కుదరదు. ఇదంతా క్యాలిక్యులేట్‌ చేసిన అల్లు అర్జున్‌ తాను చేసే లింగుస్వామి సినిమా తర్వాత కూడా మరో ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. మనం దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో ఈ చిత్రం ఉంటుందట.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఆల్రెడీ సినిమా మొదలు కావాల్సి వుంది కానీ మరీ ప్రయోగాత్మకంగా వుందని ఆ కథని బన్నీ రిజెక్ట్‌ చేశాడు. గీతా ఆర్ట్స్‌ నుంచి అడ్వాన్స్‌ తీసుకున్న విక్రమ్‌ కుమార్‌ ఇప్పుడు మరో కథ సిద్ధం చేసే పనిలో వున్నాడు. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు