వెళ్లి వెళ్లి నాగార్జున మీద పడింది

వెళ్లి వెళ్లి నాగార్జున మీద పడింది

ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న సూర్య సినిమా 'సింగం 3' ఫిబ్రవరి 9న విడుదలకి సిద్ధమవుతోంది. సంక్రాంతికి ఉన్న రష్‌ చూసి ఫిబ్రవరి 10కి ప్లాన్‌ చేసుకున్న నాగార్జున భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశ'కి ఇప్పుడు సింగం పోటీగా దిగుతోంది. జనవరి 26 నుంచి వాయిదా పడిన దగ్గర్నుంచీ, ఏదో ఒక సినిమాతో సింగంకి క్లాష్‌ తప్పదనే అనుకున్నారు.

ఫిబ్రవరిలో రిలీజ్‌ పెట్టుకున్న నిర్మాతలందరికీ ఒకింత కలవరపడ్డారు. మొత్తానికి క్లాష్‌ తప్పలేదు. నాగార్జున సినిమాతో సింగం 3 రిలీజ్‌ అవుతోంది. సింగం (యముడు) చిత్రానికి మాస్‌లో ఆదరణ బాగా వుంది. తెలుగులో ఈ చిత్రానికి ఉన్న మార్కెట్‌ని పరిగణనలోకి తీసుకునే తమిళంలో సంక్రాంతికి రిలీజ్‌ చేయలేదు. తెలుగు మార్కెట్‌ కీలకంగా మారింది కనుకే సింగం 3కి జనవరి 26 డేట్‌ని ఎంచుకున్నారు.

సోలో రిలీజ్‌ అనుకున్న నాగార్జున, రాఘవేంద్రరావుల సినిమాకిపుడు సింగంతో క్లాష్‌ పడింది. మరి ఈ క్లాష్‌లో ఏ సినిమా ఎలా ఫేర్‌ చేస్తుందనేది చూడాలి. నాగార్జునది భక్తిరస చిత్రమే అయినప్పటికీ అన్ని వర్గాలనుంచీ ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నారు. ఫక్తు మాస్‌ సినిమా అయిన సింగం ఆ చిత్రం బి, సి సెంటర్స్‌ కలెక్షన్స్‌ని ఎఫెక్ట్‌ చేస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు