రవితేజ ఆవిడని మాత్రం వదలట్లేదు!

రవితేజ ఆవిడని మాత్రం వదలట్లేదు!

లాస్ట్‌ ఇయర్‌ సింగిల్‌ రిలీజ్‌ లేకుండా గడిపేసిన రవితేజ ఈ యేడాది ఫుల్‌ బిజీగా వుండాలని అనుకుంటున్నాడు. అందుకే ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్‌ చేసాడు. అనిల్‌ రావిపూడితో దిల్‌ రాజు చిత్రం ఎప్పట్నుంచో న్యూస్‌లో నానుతోంది. దీనికి తోడు రవితేజ ఇప్పుడు 'టచ్‌ చేసి చూడు' అనే మరో చిత్రాన్ని చేయబోతున్నాడు. విక్రమ్‌ సిరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేసారు.

ఇందులో రవితేజకి జంటగా రాశిఖన్నా నటించనుంది. బెంగాల్‌ టైగర్‌లో రవితేజతో ఫస్ట్‌ టైమ్‌ జంట కట్టిన రాశి అప్పట్నుంచీ అతడికి క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిపోయింది. రాశి ఖన్నా ఏ పార్టీ ఇచ్చినా, అక్కడికి ఎవరు వచ్చినా, రాకపోయినా రవితేజ మాత్రం ఖచ్చితంగా హాజరవుతాడు. అలాగే బెంగాల్‌ టైగర్‌ తర్వాత రవితేజ చేద్దామనుకుని మానుకున్న చిత్రాల్లో కూడా కథానాయికగా రాశి ఖన్నా పేరే వినిపించింది. అతను చేస్తోన్న సినిమాలకి దర్శకులు మారారే కానీ రాశి ఖన్నా మాత్రం అలాగే కంటిన్యూ అయిపోతోంది. స్నేహమంటే ఇదేరా అంటున్నాయి వీళ్లిద్దరి బంధం చూస్తోన్న సినీ వర్గాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు