భార్యల స్నేహం భర్తల్ని దగ్గరకు చేసింది

భార్యల స్నేహం భర్తల్ని దగ్గరకు చేసింది

టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఒక చిత్రమైన కాంబినేషన్ మధ్య స్నేహం రోజు రోజుకి బలపడుతోంది. వీరిమధ్య ఫ్రెండ్ షిప్ పైన చిత్రపరిశ్రమలోనూ ఆసక్తికర చర్చ జరగుతోంది.మరి.. టాలీవుడ్ లో అత్యంత బలమైన కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య దోస్తానా రోజురోజుకీ వృద్ధి చెందుతుంటే ఆ మాత్రం మాట్లాడుకోకుండా ఉండరు కదా.

ఇంతకీ..ఆ ఇద్దరు ప్రముఖ హీరోలు ఎవరో కాదు. ప్రిన్స్ మహేశ్ బాబు అయితే మరొకరు చెర్రీగా పిలిచే రాంచరణ్ లు. నిజానికి వీరిద్దరి మధ్య పెద్దగా ఫ్రెండ్ లేదు. అలాంటిది వీరి మధ్య ఇంత క్లోజ్ నెస్ పెరగటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. వీరిద్దరి భార్యల మధ్యనున్న ఫ్రెండ్ షిప్పే కారణంగా చెప్పొచ్చు. మహేశ్ బాబు సతీమణి నమ్రత.. చెర్రీ సతీమణి ఉపాసనలు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. దీంతో.. భార్యల పుణ్యమా అని భర్తల మధ్య అనుబంధం పెరిగింది.

దీనికి తోడు ఈ మధ్యనే రెండు ఫ్యామిలీలు కలిసి ఫారిన్ టూర్ వెళ్లి రావటంతో వారి మధ్య బంధాన్ని మరింత పెంచేలా చేసిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నమ్రత బర్త్ డే పార్టీకి చాలా క్లోజ్ గా ఉండే వారినే మహేశ్ పిలిచారట.

అలా పిలుపు అందుకున్న వారిలో చెర్రీ ఫ్యామిలీ ఒకటి. మరోవైపు.. ఈ ఇద్దరూ కలిసి త్వరలో హోటల్ ఒకటి పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి భార్యల పుణ్యమా అని భర్తల మధ్య ఫ్రెండ్ షిప్ ఓ రేంజ్లో పెరగటం ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు