ఏడుస్తూ కూర్చోను: ఎన్టీఆర్‌

ఏడుస్తూ కూర్చోను: ఎన్టీఆర్‌

ఒకప్పుడు కమర్షియల్‌ సినిమాలు తప్ప మరొకటి చేయడానికి ఇష్టపడని ఎన్టీఆర్‌ ఆ ఇమేజ్‌ ఛట్రం నుంచి బయటపడ్డ తీరు తనలా ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కుపోయిన చాలా మంది హీరోలకి దిక్సూచిగా మారింది. తనని వెరైటీ పాత్రల్లో జనం ఆదరించే వరకు ఎడతెగకుండా ప్రయత్నించి తను అనుకున్నది సాధించాడు.

నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌ లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో స్టార్‌గా మరింత ఎదిగాడు, అలాగే నటుడిగా మరింత మెరుగయ్యాడు. ప్రేక్షకుల అభిరుచి మారుతున్నప్పుడు ఎవరైనా మారాల్సిందేనని, లేదంటే వెనకబడిపోతామని ఎన్టీఆర్‌ అంటున్నాడు. ఇక్కడ ఎవరూ అపజయాలకి అతీతులు కారని, ఎంత కష్టపడినా కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురౌతుంటాయని, అంత మాత్రం చేత బెంగ పడి ఏడుస్తూ ఇంట్లో కూర్చోరాదని, తదుపరి ప్రయత్నం కోసం నడుం కట్టాలని ఎన్టీఆర్‌ అన్నాడు.

''నా సినిమాలు ఫ్లాప్‌ అయినప్పుడు నేను బాధ పడతాను. అలాగని రోజుల తరబడి నిద్ర పాడు చేసుకుని, దాని గురించే ఆలోచిస్తూ కూర్చోను. దానిని వీలయినంత త్వరగా మర్చిపోయి తదుపరి చిత్రంలో ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను'' అంటూ ఎన్టీఆర్‌ తన సక్సెస్‌ సీక్రెట్‌ చెప్పాడు. త్వరలో త్రిపాత్రాభినయంతో అలరించబోతున్న ఎన్టీఆర్‌ ఇకపై అన్నీ వైవిధ్యభరిత చిత్రాలకే ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు