బాలకృష్ణ కన్నా బాలకృష్ణ అభిమానులకే అర్హతెక్కువ

బాలకృష్ణ కన్నా బాలకృష్ణ అభిమానులకే అర్హతెక్కువ

"గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రం విజయవంతం అయిన అనంతరం పలు ప్రసార మాథ్యమాలు తనను ముఖాముఖి చేయడానికి ముందుకొచ్చినప్పుడు తన కన్నా తన అభిమానికే ఆ ముఖాముఖిలో కూర్చుని మాట్లాడే అర్హత అధికంగా ఉంటుందని తెలిపానని ప్రముఖ సినీనటులు నందమూరి బాలకృష్ణ అన్నారు.
 
చిత్ర విజయోత్సవాల్లో భాగంగా అమెరికాలో పర్యటిస్తోన్న బాలయ్య, దర్శకుడు క్రిష్, నటి శ్రేయా, నిర్మాత రాజీవ్‌రెడ్డిలకు శనివారం నాడు డెట్రాయిట్‌లో జరిగిన జైత్రయాత్ర కార్యక్రమంలో స్థానిక నందమూరి అభిమానులు, ప్రవాసులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ నిర్వహించిన విజయోత్సవ సభలో కేకు కోసిన అనంతరం ప్రసంగించిన ఆయన అభిమానులే తనకు శ్రీరామరక్షగా నిలబడి ఈ చిత్రానికి ఇంతటి ఘనవిజయం చేకూర్చారని వారందరకీ తన హృదయపూర్వక ధన్యావాదాలను ప్రకటించారు. సరైన సమాయానికి సరైన వనరులు సరిగ్గా సమకూరడంతో "గౌతమీపుత్ర శాతకర్ణి" ఊపిరి పోసుకుందని క్రిష్ లాంటి దర్శకుడు చిత్రానికి మరో కథానాయకుడిలా వ్యవహరించారని ఆయన కొనియాడారు.
 
శనివారం మధ్యాహ్నం శాతకర్ణి టీ-షర్టులు ధరించి, శాతకర్ణి జెండాలతో అలంకరించిన 150 కార్లతో భారీ ర్యాలీగా బాలయ్యను ఆయన బసకు తోడ్కొని వచ్చిన అభిమానులు స్వాగత ద్వారం వద్ద పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని భారీగా చాటుకున్నారు. సాయంత్రం డెట్రాయిట్‌లోనే అత్యంత పెద్దదైన సౌత్‌ఫీల్డ్ ఏఎంసీ థియేటరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో 600కుపైగా అభిమానులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
 
చిత్ర ప్రదర్శనకు పూర్వం బాలకృష్ణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ డెట్రాయిట్ అభిమానుల స్పందన తమను పరవశానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం డెట్రాయిట్‌కు చెందిన ప్రవాస ప్రముఖులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి లక్ష డాలర్ల (రూ.70లక్షలు) విరాళాన్ని చెక్కురూపంలో బాలకృష్ణకు అందించారు.
 
పంత్ర సునీల్, దుగ్గిరాల కిరణ్‌, శుభాకర్ వెలగాల నేతృత్వంలో పుట్టగుంట సురేష్, బోయపాటి అజయ్, ఐనంపూరి వంశీలు సమన్వయపరిచిన ఈ వేడుకల్లో చిత్ర అమెరికా పంపిణీదార్లు 9పీఏం ఎంటర్‌టెయిన్‌మెంట్స్ సృజన్, శ్రీకాంత్, బాలయ్య అభిమానులు గుంటుపల్లి అనీల్, నార్నె శ్రీకాంత్, విష్ణు కణపర్తి తదితరులు పాల్గొన్నారు.

Photos link: https://goo.gl/photos/TGUwfT1jdkCdGfXi8

Video Link: https://www.youtube.com/watch?v=yPEAW5Bxf2I&feature=youtu.be

ప్రెస్ రిలీజ్ - బాలయ్య డెట్రాయిట్‌ టూర్

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English