బాస్ సినిమా ‘షో’లు తగ్గాయి

బాస్ సినిమా ‘షో’లు తగ్గాయి

సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు పోటాపోటీగా వచ్చిన సినిమాల ఫలితం తేలిపోయిన సంగతి తెలిసిందే. మొదటి వారం పూర్తి అయిపోయి.. రెండోవారం విజయవంతంగా ముగిసిపోతున్న వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంటోంది. మొదటి మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్లో దుమ్ము రేపిన బాస్ సినిమా ఖైదీ నంబరు 150సినిమా షోలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి.

మిగిలిన సెంటర్లను పక్కన పెడితే.. హైదరాబాద్ లోని మల్టీఫ్లెక్స్ లోని చాలా థియేటర్లలో ఒక్కొక్క షో చొప్పున తగ్గించేయటం కనిపిస్తోంది. ఖైదీకి ఒక రోజు ఆలస్యంగా విడుదలైన శాతకర్ణి.. శతమానం భవతి సినిమా షోలు మాత్రం రోజుకు ఐదేసి షోలను వేస్తుండగా.. ఖైదీ మాత్రం నాలుగేసి షోలకు పరిమితం చేయటం గమనార్హం.

పలు మల్టీఫ్లెక్స్ లో ఖైదీకి ఇలాంటి పరిస్థితే నెలకొందని చెబుతున్నారు. ఇక.. రిపబ్లిక్ డేకు ముందు రిలీజ్ అవుతున్న బాలీవుడ్ ప్రముఖ హీరోల చిత్రాల నేపథ్యంలో రానున్న రోజుల్లో థియేటర్లు.. షోలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఈ వీకెండ్ తో కలెక్షన్ల చిట్టా దాదాపుగా క్లోజ్ అయినట్లేనని చెప్పాలి. ఇంకా.. బండి లాగిస్తే.. మరో వారానికి మించి ఇన్నేసి థియేటర్లలో సినిమాలు నడవవని చెబుతున్నారు. ఏది ఏమైనా.. శాతకర్ణి.. శతమానం భవతితో పోలిస్తే.. ఖైదీ షోలు తగ్గటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు