సమంత డేట్స్‌ ఎక్కడివి చరణ్‌?

సమంత డేట్స్‌ ఎక్కడివి చరణ్‌?

ఒకప్పుడు తన సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న సమంతను, క్రియేటివ్‌ డెసిషన్‌ పేరుతో సినిమాలోంచి తీసి ప్రక్కన పెట్టేశారు. అవును, చరణ్‌ హీరోగా వస్తున్న ఎవడు సినిమాలో మొదట సమంతే హీరోయిన్‌. కొన్నిరోజులు ఆమెకు హెల్త్‌ బాగోకపోవడంతో సినిమా లేటవ్వగా, తరువాత సినిమాలోంచి ఆమెను క్రియేటివ్‌ కారణాల దృష్ట్యా తీసేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పాత్రనే ఇప్పుడు శృతి హాసన్‌ చేస్తోంది.

ఇకపోతే త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు చరణ్‌. ఇందులో సమంతను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. కాని మన మెగా హీరోకు ఇవ్వడానికి అసలు సమంత దగ్గర డేట్స్‌ ఎక్కడున్నాయ్‌? ఎవడు, తుఫాన్‌ సినిమాల షూటింగ్‌ పూర్తయ్యింది కాబట్టి, ఖచ్చితంగా చరణ్‌ మరో నెలలో ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్తాడు. ఇక రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, సూర్య సినిమా, బెల్లంకొండ సినిమాలతో బిజీగా ఉన్న సమంత, సంవత్సరాంతం వరకు డేట్స్‌ ఖాళీగాలేవని, కొత్త సినిమాలు సైన్‌ చెయ్యట్లేదని చెప్పేసింది.

ఈ తరుణంలో చరణ్‌ సినిమాను ఎలా చేస్తుంది? అప్పుడు చరణ్‌ వద్దనుకున్నాడు,  ఇప్పుడు కావాలన్నా సమంత అందుబాటులో ఉండేలా లేదు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు