చొక్కా విప్పడానికి రెడీ

చొక్కా విప్పడానికి రెడీ

'నేను శైలజ'తో సూపర్‌హిట్‌ కొట్టిన రామ్‌ ఆ వెంటనే 'హైపర్‌' అనే రొటీన్‌ సినిమా చేసాడు. ఆ చిత్రం నిరాశ పరచడంతో మరోసారి ఆలోచనలో పడ్డ రామ్‌ ఇంకా తన నెక్స్‌ట్‌ సినిమాపై కాల్‌ తీసుకోలేదు. కరుణాకరన్‌, 'నేను శైలజ' డైరెక్టర్‌ కిషోర్‌ ఇద్దరూ అతనికి చెరో కథ చెప్పారు. ప్రస్తుతం ఇద్దరూ ఆ కథల్ని డెవలప్‌ చేసే పనిలో వున్నారు.

ఎవరు ముందుగా స్క్రిప్టు సిద్ధం చేసుకుని వస్తే వారితో చేయడానికి రామ్‌ ఎదురు చూస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ఖాళీగా ఉండడం దేనికని అనుకున్నాడేమో జిమ్‌లో గంటల కొద్దీ సమయం గడుపుతూ సిక్స్‌ ప్యాక్‌ బాడీ సాధించాడు. ఇంతవరకు ఎప్పుడూ చొక్కా తీసి కండలు చూపించాల్సిన అవసరం పడని రామ్‌ తన మలి చిత్రంలో చొక్కా విప్పబోతున్నాడు.

ఈ చిత్రంలో కొత్తగా కనిపించాలని జుట్టు, గడ్డం కూడా బాగా పెంచాడు. మరి కరుణాకరన్‌, కిషోర్‌ ఇద్దరూ ప్రేమకథలే తీసే దర్శకులు కనుక రామ్‌ గెటప్‌ వాళ్ల కథలకి సెట్‌ అవుతుందో లేదో? ఈ గెటప్‌ ముచ్చట తీర్చుకోవడానికి ఈ మధ్యలో ఒక యాక్షన్‌ సినిమా ఏదైనా ఇరికించేస్తాడేమో. మొత్తానికి సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో కనిపించిన హీరోల లిస్టులో రామ్‌ కూడా చేరిపోతున్నాడు. అతడిని అభిమానించే అమ్మాయిలకి నెక్స్‌ట్‌ సినిమాలో ఐ ఫీస్టే సుమీ.