హాట్‌: శాతకర్ణికి మత్తెక్కించిన సుందరి

హాట్‌: శాతకర్ణికి మత్తెక్కించిన సుందరి

ప్రత్యేకించి మసాలా అంశాలు లేని గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక ఎపిసోడ్‌ మాత్రం మసాలా లవర్స్‌ని, గ్లామర్‌ ప్రియుల్ని బాగా ఆకర్షించింది. గౌతమిపుత్ర శాతకర్ణిని తన అందంతో వశం చేసుకోవడానికి వచ్చే గ్రీకు సుందరి తన అందాల విందుతో కాసేపు కదం తొక్కుతుంది. ఆ సీన్లు చూసిన వారంతా 'ఎవరీ సుందరి?' అనుకోకుండా ఉండలేరు.

అంతగా ముద్ర వేసిన ఆ అమ్మడి పేరు ఫర్రా కరిమి. డచ్‌కి చెందిన మోడల్‌ అయినా ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ధృవ చిత్రంలో అరవింద్‌ స్వామి గాళ్‌ఫ్రెండ్‌ పాత్ర చేసిన ఫర్రా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో మరింత పాపులర్‌ అయింది. అంతకుముందు తిక్క చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది కానీ అది ఫ్లాప్‌ అవడంతో ఫరాకి మళ్లీ హీరోయిన్‌ వేషాలు రాలేదు.

శాతకర్ణితో గుర్తింపు రావడంతో మరిన్ని అవకాశాల కోసం ఆమె తన పోర్ట్‌ఫోలియోని వెబ్‌సైట్స్‌కి, మీడియా హౌసెస్‌కి పంపించింది. ఫర్రా గ్లామర్‌ షో చూసి ఆమెకి తదుపరి అవకాశం ఇచ్చేదెవరు అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు