బాలకృష్ణ లేట్‌ చేశాడా?

బాలకృష్ణ లేట్‌ చేశాడా?

'గౌతమిపుత్ర శాతకర్ణి' యుఎస్‌లో అంచనాలకి మించి ఆడడంతో, తొలి వారాంతంలోనే మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో, రెండు మిలియన్‌ డాలర్లు సాధ్యమనిపించి బాలయ్యని అక్కడికి రప్పించారు. బాలకృష్ణ వస్తే, చూసిన వాళ్లే మళ్లీ సినిమా చూసేందుకు వస్తారని, తద్వారా రెండు మిలియన్‌ డాలర్లు సాధించే అరుదైన ఘనత ఈ చిత్రం సొంతమవుతుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. బాలకృష్ణ అటెండ్‌ అయిన షోస్‌ నుంచి మంచి వసూళ్లు వచ్చినప్పటికీ ఓవరాల్‌ కలక్షన్‌ డ్రాప్‌ అయింది.

 దీంతో ఈ చిత్రం రెండు మిలియన్లు సాధించడం అసాధ్యమని తేలిపోయింది. బాలకృష్ణ మొదటి వారాంతంలోనే వచ్చినట్టయితే ఫలితం మరోలా వుండేదని, ధృవ చిత్రానికి చరణ్‌ ముందుగా యుఎస్‌ వెళ్లిపోవడం, ప్రీమియర్లు పడే టైమ్‌కే అక్కడ ఉండడంతో కలిసి వచ్చిందని, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూసే వాళ్లంతా తొలి వారంలో చూసేయడంతో బాలయ్య టూర్‌ వల్ల పెద్దగా కలిసి రాలేదని అక్కడి ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.

ఒక్క శాతకర్ణి వసూళ్లనే కాదు, మొత్తంగా అన్ని సినిమాల వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఈ వారాంతంలో యుఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి లేకుండా పోయింది. వచ్చేవారంలో రయీస్‌, కాబిల్‌ చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి కనుక ఇకపై ఈ చిత్రాలకి అదనంగా వచ్చే వసూళ్లు ఏమీ ఉండకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English