సమంతని కొట్టేశాడండోయ్‌

సమంతని కొట్టేశాడండోయ్‌

నితిన్‌కి ఇప్పుడు టైమ్‌ బాగుంది. వరుసగా రెండు ఘన విజయాలు సాధించిన నితిన్‌ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్‌ మీనన్‌ నిర్మిస్తున్న 'కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌' తర్వాత నితిన్‌తో పూరి 'హార్ట్‌ ఎటాక్‌' ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. కరుణాకరన్‌ దర్శకత్వంలో నితిన్‌ ఒక సినిమా ఓకే చేశాడు. ఈ చిత్రాన్ని తన ఓన్‌ బ్యానర్‌పై చేయబోతున్నాడు. దాని తర్వాత ఏ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. గతంలో ఇతను నితిన్‌తో 'ఆటాడిస్తా' చిత్రం చేశాడు.

చౌదరి సినిమాలో నితిన్‌ సరసన సమంత నటించనుంది. ఆచి తూచి సినిమాలు ఓకే చేస్తున్న సమంత డేట్స్‌ ఇప్పుడైతే ఖాళీ లేవు. కానీ నితిన్‌ వచ్చే ఏడాదికి సమంత డేట్స్‌ అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకున్నాడు. ఈ టైమ్‌లో సమంత డేట్స్‌ సంపాదించడమంటే చిన్న విషయమేం కాదు. అగ్ర హీరోలకే డేట్స్‌ ఇవ్వనని చెబుతున్న సమంత నితిన్‌ సినిమాలో నటిస్తోందంటే అతని అదృష్టం పండినట్టే. సమంత నటించిన 'అత్తారింటికి దారేది', 'రామయ్యా వస్తావయ్యా' దసరాకి రిలీజ్‌ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కనుక అంచనాలని అందుకున్నట్టయితే ఆమె రేంజ్‌ అమాంతం రెట్టింపవుతుంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు