నాకున్నంత అభిమానులు ఎవరికీ లేరు-బాలయ్య

నాకున్నంత అభిమానులు ఎవరికీ లేరు-బాలయ్య

తనకున్నంత మంది అభిమానులు ఏ హీరోకూ లేరని వ్యాఖ్యానించాడు నందమూరి బాలకృష్ణ. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా బాలయ్య అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ..

‘‘అభిమానులే నా బలం. వాళ్లే నన్ను నడిపిస్తారు. నాకున్నంత మంది అభిమానులు ఇంకెవరికీ లేదు. వేరే వాళ్లకు ఉండొచ్చు కానీ.. నా అభిమానుల్లాగా రిజిస్టర్డ్ అభిమానులు కాదు. నాకు మొత్తం 4500కు పైగా అభిమాన సంఘాలున్నాయి. ఈ స్థాయిలో అభిమానులు ఎవరికీ ఉండరు’’ అని బాలయ్య వ్యాఖ్యానించాడు.

తాను ముందే అన్నట్లుగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత కొత్త బాలకృష్ణను ప్రేక్షకులు చూడబోతున్నారని.. గతంలో కొన్నిసార్లు కాంప్రమైజ్ అయి కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఇకపై అలా చేయబోనని.. తన సినిమాలు, పాత్రలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని బాలయ్య వ్యాఖ్యానించారు.

క్రమశిక్షణ అన్నది తన తండ్రి నుంచి తనకు వారసత్వంగా వచ్చిందని.. అదే తన ఆరోగ్య రహస్యం కూడా అని బాలయ్య వ్యాఖ్యానించాడు. తాను ఉదయం ఏడు గంటలకల్లా సెట్ కు వెళ్తానని.. అందరూ తాను రాగానే అలెర్టవుతారని.. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం తనకు అలవాటని బాలయ్య వ్యాఖ్యానించాడు. అమెరికాలో డల్లాస్ సహా ఎక్కడ పర్యటించినా తనకు తెలుగు రాష్ట్రంలోనే ఉన్నట్లుంటుందని.. అక్కడి జనాలు తనతో అంత ఆప్యాయంగా ఉంటారని బాలయ్య చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు