ఆఫ్రికా భాషలో సంపూ సినిమా?

ఆఫ్రికా భాషలో సంపూ సినిమా?

‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేష్ బాబు ఎలాంటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో పెద్దగా ఎవరూ టచ్ చేయని సెటైరికల్ జానర్లో ఈ సినిమాను రూపొందించి సక్సెస్ సాధించింది ఈ చిత్ర బృందం. ఇదే కోవలో ‘కొబ్బరి మట్ట’ పేరుతో చాన్నాళ్ల కిందట ఓ సినిమా మొదలుపెట్టారు. గత ఏడాది ఒక లెంగ్తీ డైలాగ్ తో వెరైటీ టీజర్ కూడా వదిలారు. ఐతే తర్వాత ఈ సినిమా వార్తల్లో లేదు. దీని గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందేమో అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఓ ఆసక్తికర అప్ డేట్ తో వార్తల్లోకి వచ్చింది.

‘కొబ్బరి మట్ట’ సినిమాను ఆఫ్రికా భాషలోకి అనువాదం చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్ డేట్. నైజీరియాలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. మరో విశేషం ఏంటంటే.. ‘కొబ్బరి మట్ట’ను తమిళ.. కన్నడ భాషల్లోకి కూడా అనువదించే పనిలో ఉన్నారట. మన దగ్గర సంపూ అనుకోకుండా క్రేజ్ సంపాదించేశాడు కానీ.. మరీ ఆఫ్రికాలో అతడి సినిమాను రిలీజ్ చేసేంత సీన్ ఉందా అన్నది డౌటు. తమిళ.. కన్నడ భాషల్లోకి ఈ చిత్రాన్ని డబ్ చేయాలనుకోడం కూడా కొంచెం టూమచ్ అనే చెప్పాలి. మరి వాళ్ల కాన్ఫిడెన్స్ ఏంటో మరి. వేరే భాషల సంగతేమో కానీ.. రెండేళ్ల ముందు మొదలైన ఈ చిత్రాన్ని ముందు తెలుగులో రిలీజ్ చేయడం గురించి ఆలోచించాలి. ఇలా సుదీర్ఘ కాలం సినిమాను వాయిదా వేస్తూ వచ్చేసరికి ఇంతకుముందున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఇంకా ఆలస్యం చేస్తే సినిమాపై పూర్తిగా ఆసక్తి చచ్చిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు