ఎన్టీఆర్ పాటకే ఓటేసిన కాజల్

ఎన్టీఆర్ పాటకే ఓటేసిన కాజల్

'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పాట రిలీజ్ అయినప్పుడు ఇది అచ్చంగా 'పక్కా లోకల్' పాటలా వుందనే కామెంట్లు వినిపించాయి. అయితే చిరంజీవి పాట కూడా జనతా గ్యారేజ్ పాటలానే సూపర్హిట్ అయిపోయిందనుకోండి. విశేషం ఏమిటంటే ఈ రెండు పాటల్లోను హీరోయిన్ కాజలే.

మరి ఈ రెండు పాటల్లో తనకేది ఇష్టమని అడిగితే, తడుముకోకుండా 'పక్కా లోకల్' అని చెప్పింది. మొట్ట మొదటిసారిగా తాను ఒక ఐటెమ్ సాంగ్ చేసిందంటూ వుంటే అది 'పక్కా లోకలే' కనుక తన పరంగా అదెప్పుడూ స్పెషల్ సాంగ్ అని వివరించింది. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ వర్సెస్ 'పక్కా లోకల్' సాంగ్లో కాజల్ ఎందులో బాగుందనే పోల్ పెడితే 'లోకల్' పాటకే ఓట్లు ఎక్కువ పడతాయనే దాంట్లో సందేహం అక్కర్లేదు.

మొదటి సారి ఐటెమ్ సాంగ్ చేసినప్పటికీ కాజల్ ఆ పాటలో మతులు పోగొట్టింది. ఆ చిత్రం హిట్ క్రెడిట్లో కొంత ఆ పాటకే దక్కుతుంది. ఫ్లాప్లకి బ్రేక్ వేసి 'ఖైదీ నంబర్ 150'తో మళ్లీ హిట్టు కొట్టిన కాజల్ ఇంకొంతకాలం నటన మీదే దృష్టి పెడతానని, వేరే వ్యాపకాలేం పెట్టుకోనని చెప్పింది.

తనకి పెళ్లి గురించి ఆలోచన లేదని, దయచేసి పెళ్లెప్పుడు చేసుకుంటావని అడగొద్దని రిక్వెస్ట్ చేస్తోంది. ఇంత అందగత్తె ఇంకొంత కాలం కనువిందు చేస్తానంటుంటే పెళ్లి చేసుకోమంటూ పోరు పెట్టడమేంటండీ చోద్యం కాకపోతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు