సంక్రాంతి సినిమాలు బాగా పడ్డాయ్‌

సంక్రాంతి సినిమాలు బాగా పడ్డాయ్‌

ఓవర్సీస్‌లో, ముఖ్యంగా యుఎస్‌లో తొలి వారం అదరగొట్టిన సంక్రాంతి చిత్రాలు బుధవారం నుంచి సడన్‌గా డ్రాప్‌ అయిపోయాయి. వీక్‌ డేస్‌లో వసూళ్లు వీక్‌గా ఉండడం కామన్‌ అయినప్పటికీ, బుధ, గురువారాల్లో వచ్చిన వసూళ్లు షాకింగ్‌గా ఉన్నాయి.

మరీ చిల్లర రాలేసరికి సెకండ్‌ వీకెండ్‌ పర్‌ఫార్మెన్స్‌పై అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం పుంజుకుంటాయని చూస్తే, ఇప్పటివరకు వచ్చిన వసూళ్ల లెక్కలని బట్టి ఏమంత ఇంప్రూవ్‌మెంట్‌ కనిపించలేదు. దీంతో శనివారం కీలకంగా మారింది. శనివారం ఎంత వసూలు చేస్తాయనే దానిపై ఈ చిత్రాల ఫుల్‌ రన్‌ కలక్షన్‌ని ఎస్టిమేట్‌ చేయవచ్చు. రెండవ వారంలో బాగా ఆడుతుందని, మిలియన్‌ డాలర్లు చేరుతుందని అనుకున్న 'శతమానం భవతి' సడన్‌గా వేగం కోల్పోయింది.

'ఖైదీ నంబర్‌ 150' దూకుడు మొదటి వారంలోనే మందగించిగా, బాలకృష్ణ టూర్‌కి వెళ్లారు కనుక 'గౌతమిపుత్ర శాతకర్ణి' వసూళ్లు బాగుంటాయనే అంచనా వేస్తున్నారు.

ఈ మూడు సినిమాలకీ శనివారం వసూళ్లే కీలకం. ఒక్కసారి డౌన్‌ ట్రెండ్‌ చూసిన తర్వాత యుఎస్‌లో ఏ సినిమా మళ్లీ డ్రమెటిక్‌గా పుంజుకున్న దాఖలాలు లేవు. ఈ సినిమాలతో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు