చిరంజీవికేనా, బాలకృష్ణకి చెయ్యరా?

చిరంజీవికేనా, బాలకృష్ణకి చెయ్యరా?

150 సినిమాలు పూర్తి చేసుకున్న చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలోకి మళ్లీ అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా సత్కరించారు. అయితే మరో నట దిగ్గజం బాలకృష్ణ వంద చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా ఎవరూ సత్కరించలేదు. 100వ సినిమాగా చారిత్రిక చిత్రాన్ని చేయడమే కాకుండా, 'గౌతమిపుత్ర శాతకర్ణి' అంటే ఇలాగే ఉండేవాడేమో అన్నట్టుగా నటించి, మెప్పించిన బాలకృష్ణ ఈ చిత్రంతో విజయాన్ని కూడా అందుకున్నారు.

ముందుగా చిరంజీవిని సత్కరించిన సుబ్బిరామిరెడ్డి మరి త్వరలో బాలకృష్ణకి కూడా సన్మానం ఏర్పాటు చేస్తారో లేక సినీ పరిశ్రమ ఈ ఇద్దరు దిగ్గజాలకీ సన్మానం చేస్తుందో చూడాలి. హీరోగా వంద సినిమాలు పూర్తి చేసుకోవడమనేది ఇకపై జరగకపోవచ్చు. నాగార్జున మినహా మిగిలిన హీరోలు వంద సినిమాల మార్కుని చేరుకోవడం అసాధ్యమేననిపిస్తోంది.

కనుక చిరంజీవి, బాలకృష్ణ సాధించిన ఘనతకి ఘన సత్కారం చేయాల్సిందే. మాస్‌ హీరోగా పేరు గడించినప్పటికీ బాలకృష్ణలా వివిధ జోనర్స్‌ ట్రై చేసిన హీరోలు బహు అరుదు. ఆదిత్య 369తో సైన్‌ ఫిక్షన్‌, భైరవద్వీపంతో జానపదం, శ్రీకృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యంతో పౌరాణికం, గౌతమిపుత్ర శాతకర్ణితో చారిత్రాత్మకం ఇలా ఇన్ని జానర్స్‌ ట్రై చేసిన హీరో తన తరంలోను, తన తర్వాతి తరంలోను బాలయ్య ఒక్కరే. ఆయనకి ఇంతవరకు సత్కారం ఏర్పాటు చేయకపోవడం హాస్యాస్పదం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English