సమంతని మిసెస్‌ అనేస్తున్నాడుగా!

సమంతని మిసెస్‌ అనేస్తున్నాడుగా!

నాగచైతన్య, సమంతల రిలేషన్‌ ఓపెన్‌ బుక్‌ ఇప్పుడు. పెద్దల అనుమతి పొందిన ఈ జంట పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సహ జీవనం చేస్తోన్న చై, సమంత ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నారు. పండుగలు, పార్టీలు అన్నీ కలిసే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. చైతన్యకి రేసింగ్‌ అంటే పిచ్చి. ఢిల్లీలో రేసింగ్‌ ట్రాక్‌పై తన స్పోర్ట్స్‌ కార్‌తో రచ్చ చేసాడు.

ఈ సందర్భంగా చైతన్యని, తన కారుని సమంతే ఫోటోలు తీసింది. వాటిని అభిమానులతో షేర్‌ చేసుకుంటూ, ఈ ఫోటోలు క్లిక్‌ చేసింది 'మిసెస్‌' అని చెప్పాడు. ఇంకా తాళి కట్టలేదు కానీ తనకి అర్ధాంగిగా ఇచ్చిన స్థానాన్ని చైతన్య తెలియజెప్పాడు. మరికొద్ది రోజుల్లో నిశ్చితార్ధం చేసుకోబోతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మొదట్లో పెళ్లిని కాస్త డిలే చేద్దామని అనుకున్నప్పటికీ ఇప్పుడా ముచ్చట కోసం ఇద్దరూ తొందర పడుతున్నట్టే ఉన్నారు.

పెళ్లి తర్వాత నటించడం, నటించకపోవడం గురించిన పూర్తి స్వేఛ్ఛని సమంతకి చైతన్య ఇచ్చేసాడు. తన జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు తనకే ఉందని స్పష్టం చేశాడు. పెళ్లి తర్వాత నటనకి స్వస్తి చెప్పాల్సిందే అనేవాళ్లు ఎక్కువ ఉండే ఇండస్ట్రీలో చైతన్యలా ఉన్నతంగా ఆలోచించేవాళ్లు బహు అరుదు. సూపర్‌ చైతూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు