మణిరత్నం కథ వినగానే ఆమెకు కన్నీళ్లే..

మణిరత్నం కథ వినగానే ఆమెకు కన్నీళ్లే..

అదితిరావు హైదరి.. బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. రాజ్-3 లాంటి సినిమాల్లో అందాల ఆరబోతతో బాగానే ఫేమస్ అయింది అదితి. ఆమె చేసిన ఫొటో షూట్లు కూడా కుర్రాళ్ల మతులు పోగొట్టాయి.

ఐతే బాలీవుడ్లో సెక్సీ ఇమేజ్ తెచ్చుకున్న అదితిని తన సినిమాకు కథానాయికగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. ఆ సినిమానే డ్యూయెట్. ఓ హీరోయిన్‌కు అప్పటిదాకా ఎలాంటి ఇమేజ్ ఉన్నప్పటికీ.. మణిరత్నం సినిమా చేశాక ఇమేజ్ పూర్తిగా మారిపోయి.. దశ తిరిగిపోతుందని అంటారంతా. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. అదితి కూడా మణి సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది.

ఇప్పటికే ‘డ్యూయెట్’ చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది ప్రస్తుతం. ఈ సినిమా అనుభవం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడింది అదితి.

‘‘మణిరత్నం సినిమాలో నటించడం నా అదృష్టం. ఆయనతో సినిమా అనగానే ఎంత ఎగ్జైట్ అయ్యానో చెప్పలేదు. కథ వింటున్నపుడు ఆ ఎగ్జైట్మెంట్ రెట్టింపైంది. మణి సార్ నరేషన్ పూర్తి చేసేసరికి నాకు కన్నీళ్లు వచ్చేశాయి. అంత ఎమోషనల్ డెప్త్ ఉంది ఈ కథలో. ఈ సినిమాతో కచ్చితంగా నా కెరీర్ మలుపు తిరుగుతుంది. రిలీజ్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా’’ అని అదితి చెప్పింది. కార్తి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు