సురేందర్‌తోనే మూవీ నంబర్‌ 151

సురేందర్‌తోనే మూవీ నంబర్‌ 151

చిరంజీవి తదుపరి చిత్రంపై సస్పెన్స్‌ వీడిపోయినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. ఖైదీ నంబర్‌ 150 చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌తో చిరంజీవి తన నెక్స్‌ట్‌ మూవీ కూడా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని డిసైడయ్యారు. ధృవ చిత్రం టైమ్‌లోనే సురేందర్‌తో ఒక సినిమా చేద్దామని చిరంజీవి కమిట్‌ అయ్యారు. అప్పుడతను చెప్పిన ఒక కథ చిరంజీవికి నచ్చిందట. ఆ కథపై వర్క్‌ చేసిన సురేందర్‌ లేటెస్ట్‌ నెరేషన్‌ ఇంకా నచ్చడంతో చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్టు ప్రచారమవుతోంది.

అయితే ఈ వార్తని చరణ్‌ కానీ, కొణిదెల ప్రొడక్షన్స్‌ పిఆర్‌ టీమ్‌ కానీ ధృవీకరించలేదు. వినిపిస్తోన్న వార్తలని బట్టి మార్చిలో ఈ చిత్రం లాంఛ్‌ అవుతుందని తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం చేద్దామని ఉన్నప్పటికీ దాని కోసం చిరంజీవి ఇంకాస్త టైమ్‌ తీసుకుంటున్నారు.

ఖైదీకి అద్భుతమైన స్పందన రావడంతో కమర్షియల్‌ సినిమా మరొకటి చేసిన తర్వాత బరువైన సబ్జెక్టుల వైపు వెళ్లాలని అనుకుంటున్నారు. మరి సురేందర్‌ చిత్రాన్ని ఓకే చేసినట్టయితే ఈసారి చిరంజీవితో జంట కట్టేదెవరో? ఈ చిత్రంలో చిరంజీవి చేసే క్యారెక్టర్‌ ఎలాగుంటుందో? మెగా ఫాన్స్‌కి మళ్లీ ఎక్సయిట్‌మెంట్‌ షురూ అయినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు