రవితేజ బండి కదిలేదెప్పుడో?

రవితేజ బండి కదిలేదెప్పుడో?

ఒక ఏడాది మొత్తం ఏ సినిమా చేయాలనే దానిపై మీన మేషాలు లెక్క పెడుతూనే వృధా చేసేసాడు రవితేజ. దిల్‌ రాజుతో సినిమా కాన్సిల్‌ చేసింది లగాయతు అతనికి ఏదీ కలిసి రాలేదు. చాలా ప్రాజెక్టులు కాన్సిల్‌ అయిన తర్వాత మళ్లీ దిల్‌ రాజుతోనే రాజీ చేసుకుని అతని బ్యానర్లోనే సినిమా చేయబోతున్నాడు.

అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో చేయనున్న ఆ చిత్రం ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా క్లారిటీ లేదు. రవితేజ ఈ చిత్రంలో అంధుడి పాత్ర పోషించనున్నాడు. ఈ పాత్ర కోసమని రవితేజ ప్రస్తుతం హోంవర్క్‌ చేస్తున్నాడు. దిల్‌ రాజుకి చేతినిండా సినిమాలు ఉండడంతో ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని మొదలు పెడుతున్నాడు.

చూస్తుంటే ఈ చిత్రం కదలడానికి కాస్త టైమ్‌ పట్టేలాగుంది. ఇప్పటికే పదిహేను నెలలు వృధాగా గడిపేసిన రవితేజ మరింత లేట్‌ చేయడం మంచిది కాదు. తన ఆబ్సెన్స్‌లో మిడ్‌ రేంజ్‌ మార్కెట్లోకి చాలా మంది హీరోలు దూసుకు వచ్చారు. నాని, సాయి ధరమ్‌ తేజ్‌, రామ్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులంతా రవితేజ తరహా చిత్రాలతోనే యమ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రవితేజకి రావాల్సిన కథలు చాలా వరకు వీళ్లని వెతుక్కుంటూ పోతున్నాయి. త్వరగా వచ్చి తన ఉనికి చాటుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English