నాగబాబు దగ్గర డబ్బులు లేవా?

నాగబాబు దగ్గర డబ్బులు లేవా?

నిర్మాతగా చిరంజీవితో పలు చిత్రాలు నిర్మించిన నాగబాబు గత పదేళ్లలో పవన్‌తో గుడుంబా శంకర్‌, చరణ్‌తో ఆరెంజ్‌ చిత్రాలు నిర్మించాడు. తను నిర్మించిన చిత్రాల్లో అధిక శాతం ఫ్లాప్‌ అయినప్పటికీ క్రేజీ కాంబినేషన్లు కావడంతో ప్రతిసారీ నాగబాబు గట్టెక్కేసాడు. ఆరెంజ్‌ చిత్రం డిజాస్టర్‌ అయినా కానీ మగధీర తర్వాత వచ్చిన చిత్రం కావడంతో నాగబాబుకి ఎలాంటి నష్టం జరగలేదు. బయ్యర్లు మునిగిపోయారు కానీ నాగబాబు మాత్రం ఒడ్డున పడ్డాడు. అయినప్పటికీ ఆ తర్వాత నిర్మాణానికి నాగబాబు పూర్తిగా దూరమైపోయాడు.

చిరంజీవి సినిమాలు మానేయడం ఒక కారణమైతే, సొంత మనుషులు తనని మోసం చేసి తన డబ్బులు చాలా వరకు కాజేయడం మరో కారణం. ఎప్పటికైనా మళ్లీ అంజనా ప్రొడక్షన్స్‌పై నాగబాబు సినిమా తీస్తాడని అనుకుంటూ ఉండగా తనయుడు వరుణ్‌ తేజ్‌ రంగ ప్రవేశం చేసాడు. వరుణ్‌ హీరోగా నాగబాబు సొంత సినిమా వుంటుందని చాలా కాలంగా వినిపిస్తున్నా కానీ అతను మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

వరుణ్‌ వరుసపెట్టి అన్నీ బయటి బ్యానర్లకే సినిమాలు చేస్తున్నాడు. కొడుకుతో సినిమా తీయడానికి నాగబాబు దగ్గర డబ్బులు లేవా లేక నిర్మాతగా తాను సక్సెస్‌ కాలేనని ఆయన ఇప్పటికే డిసైడైపోయి దూరంగా ఉంటున్నాడా? వరుణ్‌ మాత్రం ఇప్పుడు సినిమాకి మూడు కోట్లు తీసుకుంటూ బిజీగానే వున్నాడు. మరోవైపు నాగబాబు కూడా సింగిల్‌ కాల్షీట్‌ మీద లక్ష రూపాయలు సంపాదిస్తూ బాగానే గడిస్తున్నాడు. సొంత నిర్మాణం తలనొప్పుల కంటే ఇదే బెస్ట్‌ అనుకుంటున్నారేమో తండ్రీతనయులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు