మెగాస్టార్ ముందుచూపుకి హేట్సాఫ్

మెగాస్టార్ ముందుచూపుకి హేట్సాఫ్

'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే చాలా ఎపిసోడ్ల చిత్రీకరణ జరిగింది. గత ఏడాది దసరాకే ప్రసారం మొదలు కావాల్సిన ఈ షోని కావాలని డిలే చేసారు. తన రీఎంట్రీ చిత్రం రిలీజ్ అయిన తర్వాత షో స్టార్ట్ చేస్తే టీఆర్పీలు బాగుంటాయని చిరంజీవి సూచించడం వల్లే దీని టెలికాస్ట్ ఆపారట.

ఎన్నో ఏళ్ల తర్వాత తనని తెరపై చూడ్డానికి సినీ ప్రియులు ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారనేది చిరంజీవికి తెలుసు. సినిమా రిలీజ్‌కి ముందే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో బుల్లితెరపై రోజూ కనిపించేస్తూ ఉంటే తప్పకుండా ఆ ఆసక్తి సన్నగిల్లుతుంది. దాని ఎఫెక్ట్ 'ఖైదీ నంబర్ 150' కలెక్షన్లపై పడుతుందనేది చిరంజీవి భావించారు.

అందుకే ఇటు తన సినిమాకీ, అటు తన టీవీ షోకి రెండిటికీ కలిసి వచ్చేలా ముందుగా సినిమా రిలీజ్ అయిన తర్వాతే షో ప్రసారం మొదలు పెట్టాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. చిరంజీవి సూచనలు బాగుండడంతో ఆ కార్యక్రమం టెలికాస్ట్ కొద్ది రోజులు హోల్డ్‌లో పెట్టారు. ఖైదీ ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ షో ప్రసారం మొదలు కానుంది. చిరంజీవికి దక్కిన ఘన స్వాగతాన్ని చూసి మా టీవీ యాజమాన్యం కూడా సంబరపడిపోతోందట.

ఖచ్చితంగా చిరంజీవి హోస్ట్‌గా ఉంటే టీఆర్పీలు తారాస్థాయిలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలే బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తోంది కనుక ఫాన్స్ కూడా ఉత్సాహంగా టీవీలకి అతుక్కుపోతారు. పర్ఫెక్ట్ స్ట్రాటజీ వర్కవుట్ చేసిన మెగాస్టార్ ముందుచూపుకి ఎవరైనా హేట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు