సర్కార్ కోసం సెక్సీ విలన్

సర్కార్ కోసం సెక్సీ విలన్

రాంగోపాల్‌వర్మ కెరియర్ని రీవాంప్ చేస్తుందని అనుకున్న 'వంగవీటి' నిరాశ పరచడంతో ఇప్పుడు తన ఆశలన్నీ 'సర్కార్ 3' మీదే పెట్టుకున్నాడు వెటరన్ డైరెక్టర్. స్టార్స్‌తో సినిమాలు తీయడం మానేసి లో బడ్జెట్‌తోనే ఏవేవో సినిమాలు తీస్తూ పోతున్న వర్మ 'సర్కార్ 3' చిత్రానికి మళ్లీ స్టార్స్‌తో పని చేస్తున్నాడు.

ఈ ఫ్రాంచైజీకి ఉన్న విలువ వల్ల దీనిని లో బడ్జెట్లో కాకుండా మంచి బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నారు. తారాగణం పరంగా వర్మ ఎక్కడా రాజీ పడడం లేదు. అమితాబ్ నటిస్తుండడం వల్ల తను కోరుకున్న తారల్ని తెచ్చుకోవడం వర్మకి అంత కష్టమవడం లేదు. ఇందులో ఒక కీలక పాత్రకి యామీ గౌతమ్‌ని తీసుకున్నాడు.

ఇందులో ఆమె విలన్ పాత్ర చేస్తున్నట్టు తెలిసింది. తన తండ్రిని చంపిన సర్కార్‌పై పగ తీర్చుకోవడానికి వచ్చే యువతిగా ఇందులో యామీ నటిస్తోంది. అమితాబ్‌తో నటించాలనే తన కల నెరవేరిందని, ఆయనతో నటించే ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నానని, అందుకే విలన్ వేషమా, మరొకటా అని ఆలోచించకుండా ఈ చిత్రాన్ని సైన్ చేసానని యామీ చెప్పింది.

ఇదిలావుంటే హృతిక్ రోషన్‌కి జంటగా యామీ గౌతమ్ నటించిన 'కాబిల్' వచ్చే వారం విడుదల కానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ అగ్ర తారల లిస్టులోకి చేరిపోతానని ఆశిస్తోన్న యామీని విలన్ పాత్రలో వర్మ ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు