అత్యాశే ఖైదీ డిస్ట్రిబ్యూటర్‌ని ముంచింది

అత్యాశే ఖైదీ డిస్ట్రిబ్యూటర్‌ని ముంచింది

మూడు సినిమాలు రిలీజ్‌ అవుతున్నపుడు తమ చిత్రానికి అన్ని విధాలా అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవడం డిస్ట్రిబ్యూటర్‌ బాధ్యత. పన్నెండు కోట్ల రూపాయలకి ఖైదీ నంబర్‌ 150 ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకున్న పంపిణీదారుడు బేసిక్స్‌ పాటించలేదంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్‌ షోస్‌కి పాతిక డాలర్ల టికెట్‌ పెట్టినా ఎవరూ కంప్లయింట్‌ చేయలేదు. చిరంజీవిని చూడాలనే కుతూహలం కలిసొచ్చి ప్రీమియర్లనుంచే 1.25 మిలియన్‌ డాలర్లు వసూలయ్యాయి. అలాంటి ఆరంభం దొరికిన సినిమాకి డీసెంట్‌ టాక్‌ వచ్చినపుడు లాంగ్‌ రన్‌ బ్రహ్మాండంగా వుండాలి.

కానీ రెగ్యులర్‌ షోస్‌కి ఇరవై డాలర్ల టికెట్‌ రేటు ఫిక్స్‌ చేయడం, పిల్లల టికెట్లకి పద్ధెనిమిది డాలర్లు వసూలు చేయడంతో అక్కడి సినీ ప్రియులకి ఒళ్లు మండింది. పదిహేను డాలర్లకే వస్తోన్న గౌతమిపుత్ర శాతకర్ణి, పన్నెండు డాలర్ల టికెట్‌ రేటుతో ఆడుతోన్న శతమానం భవతి చిత్రానికి ప్రిఫరెన్స్‌ ఇచ్చారు. దాంతో ప్రీమియర్స్‌ తర్వాత ఖైదీ చిత్రం ఓవర్సీస్‌లో ఊహించిన స్థాయిలో ఆడలేకపోయింది.

తప్పు తెలుసుకుని ఇప్పుడు పన్నెండు డాలర్లకి టికెట్‌ రేటు తగ్గించినప్పటికీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఈపాటికే మూడు మిలియన్‌ డాలర్లు వసూలు చేసి వుండాల్సిన సినిమా ఫుల్‌ రన్‌లో 2.5 మిలియన్‌ డాలర్లయినా సాధిస్తుందో లేదో అనేది అనుమానంగా వుంది. ప్రీమియర్‌ షోస్‌ అరేంజ్‌మెంట్స్‌ దగ్గర్నుంచీ టికెట్‌ ప్రైసింగ్‌ వరకు అన్నిటా తప్పులు చేసుకుంటూ పోయిన డిస్ట్రిబ్యూటర్‌ సేఫ్‌ అయిపోయాడంటే అది చిరంజీవి చలవే.

దీనిపై లాభాలు చవిచూడాల్సిన వాడల్లా ఇప్పుడు బ్రేక్‌ ఈవెన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాంగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ చేతిలో పడి మూడు మిలియన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచే సువర్ణాకాశాన్ని మిస్‌ అయిపోయామని చిరంజీవి అభిమానులు వాపోవడం సోషల్‌ మీడియాలో తరచుగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు