అల్లు అరవింద్‌పై డిపెండ్‌ అవడం మానలేదు

అల్లు అరవింద్‌పై డిపెండ్‌ అవడం మానలేదు

గీతా ఆర్ట్స్‌ ఉన్నప్పటికీ తమదంటూ సొంత నిర్మాణ సంస్థ ఉండాలని 'కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ' స్టార్ట్‌ చేసిన రామ్‌ చరణ్‌ తన తండ్రి పునరాగమన చిత్రాన్ని తన బ్యానర్లోనే నిర్మించాడు. పేరుకి చరణ్‌ నిర్మాత అయినప్పటికీ ఖర్చుల వ్యవహారాలన్నీ అల్లు అరవింద్‌ చూసుకున్నారని, పబ్లిసిటీ పరమైన నిర్ణయాలు మాత్రం చరణ్‌ చూసుకున్నాడని సమాచారం.

అలాగే ఈ చిత్రానికి అధికారిక నిర్మాత అయిన చరణ్‌ అఫీషియల్‌ ప్రెస్‌మీట్స్‌కి కూడా 'హీరోలా' డుమ్మా కొడుతున్నాడు. మామూలుగా అన్ని ప్రెస్‌మీట్లకీ స్టార్‌ హీరోలు అటెండ్‌ అవరు. కానీ నిర్మాత హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చరణ్‌ వచ్చి తీరాలి. అయితే ఖైదీ విడుదలైన రెండుసార్లు మీడియాని కలిసిన అల్లు అరవింద్‌ కలక్షన్‌ వివరాలను తానే ప్రకటించారు.

ఈ రోజు జరిగిన ప్రెస్‌మీట్‌కి చరణ్‌ హాజరవుతాడని, తన నోటితోనే కలెక్షన్ల వివరాలు ప్రకటిస్తాడని ఉదయమంతా ఊదరగొట్టారు. తీరా ప్రెస్‌మీట్‌కి చరణ్‌ రాలేదు. త్వరలో జరగబోయే థాంక్యూ మీట్‌కి చిరు, చరణ్‌ అందరూ వస్తారంటూ అల్లు అరవింద్‌ వివరణ ఇచ్చారు. ఈ చిత్రం వారం రోజుల్లో 108 కోట్ల 48 లక్షల గ్రాస్‌ వసూలు చేసిందంటూ అల్లు అరవింద్‌ మీడియాకి చెప్పారు.

ఈ చిత్రానికి సమర్పకునిగా కూడా వ్యవహరించని అల్లు అరవింద్‌ విడుదలైన దగ్గర్నుంచీ నిర్మాత చేయాల్సిన పని తానే చేస్తున్నారు. దీనిని బట్టి మెగాస్టార్‌ ఫ్యామిలీ అల్లు అరవింద్‌పై ఆధారపడడం మానలేదనేది సుస్పష్టమవుతోంది. ఈమాత్రం దానికి మరో బ్యానర్‌ ఎందుకు స్టార్ట్‌ చేసారనేది వారికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు