బాలయ్య దాని సంగతి తేల్చడేంటి?

బాలయ్య దాని సంగతి తేల్చడేంటి?

కొన్నేళ్లుగా మన స్టార్ హీరోలందరూ వేగం పెంచారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తమ తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలయ్య కూడా అలా చేస్తూ వచ్చినవాడే కానీ.. గత ఏడాది తన వందో సినిమా విషయంలో మాత్రం టైం తీసుకున్నాడు. తన ముందుకు వచ్చిన అనేక ప్రతిపాదనల్ని పరిశీలించి చివరికి 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి ఓటేశాడు.

ఐతే వందో సినిమా కాబట్టి అంతగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సబబే అనుకోవచ్చు. ఐతే 101వ సినిమా విషయంలోనూ బాలయ్య క్లారిటీతో ఉన్నట్లుగా కనిపించట్లేదు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైన వెంటనే తన తర్వాతి సినిమాను బాలయ్య మొదలుపెట్టేస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పట్లేదు.

'గౌతమీపుత్ర శాతకర్ణి'ని గట్టిగా ప్రమోట్ చేస్తున్న బాలయ్య.. తన తర్వాతి సినిమా గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. అమితాబ్ ఒప్పుకుంటేనే 'రైతు' ఉంటుందని ఒక వ్యాఖ్య అయితే చేశాడు కానీ.. అమితాబ్ ఏం చెప్పాడో.. ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో లేదో మాత్రం వెల్లడించలేదు. మరోవైపు 'రైతు' తీయాల్సిన కృష్ణవంశీ ఏమో ఇంకా 'నక్షత్రం' ప్రాజెక్టు నుంచి బయటికి రాలేదు.

ప్రస్తుతానికైతే బాలయ్య ముందు వేరే ఛాయిస్‌లు ఉన్నట్లయితే కనిపించట్లేదు. ఆయన తర్వాతి సినిమా గురించి ఇంకే వార్తలూ రావట్లేదు. మరి బాలయ్య ఆలోచన ఏంటన్నది ఎవరికీ అంతు బట్టడం లేదు. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే ఈ ఏడాది బాలయ్య సినిమా ఇంకోటి చూసే అవకాశం ఉండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు