శాతకర్ణి.. సింగర్ సునీతకో మైల్ స్టోన్

శాతకర్ణి.. సింగర్ సునీతకో మైల్ స్టోన్

శాతకర్ణి సినిమా పేరు చెప్పిన వెంటనే బాలకృష్ణ వందో సినిమాగా అందరూ టక్కున చెప్పేస్తారు. అయితే.. ఇదే సినిమాలో సింగర్ సునీత ఒక మైల్ స్టోన్ కు రీచ్ అయ్యింది. సింగర్ గా పరిచయమై.. ఆ తర్వాతి కాలంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితం కావటమే కాదు.. తన తేనలూరించే స్వరంతో మాటల్ని మంత్రాలుగా మార్చటమే కాదు.. హీరోయిన్ కు సరికొత్త అందంగా ఆమె వాయిస్ మారిందనటంలో సందేహం లేదు.

శాతకర్ణి చిత్రంలో శ్రియ కొన్ని మాటలు మత్తెక్కించేలా ఉంటాయి. అదే సమయంలో మరికొన్ని మాటలు తూటాల మాదిరిగా ఉండటమే కాదు.. కత్తి కొన కంఠానికి తాకినట్లుగా చురుకు కలిగిస్తాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ లు ఎంతమంది ఉన్నా.. మాటల్లో భావాన్ని పలికించే వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో సునీత ఒకరు.

శాతకర్ణి.. సునీతకు మైల్ స్టోన్ ఎలా ఉంటుందన్న విషయంలోకి వెళితే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమెకు ఇది 750వ చిత్రం. గులాబీతో సింగర్ గా కెరీర్ ను షురూ చేసిన ఆమె.. ఇప్పటివరకూ వందల చిత్రాల్లో వందలాది పాటలు పాడటమే కాదు.. పలు కార్యక్రమాలకు యాంకర్ గా.. న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

శాతకర్ణి గురించి మాట్లాడిన సునీత.. బాలకృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో తాను ఒక భాగం కావటం ఒక ఎత్తు అయితే.. ఈ చిత్రం డబ్బింగ్ అర్టిస్ట్ గా తనకు 750వ చిత్రం కావటం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రంలో మీ వాయిస్ చాలా బాగుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారని పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు