నాన్నగారి కోసం... చరణ్‌ ధైర్యం

నాన్నగారి కోసం... చరణ్‌ ధైర్యం

అధికారికంగా ఒక సినిమాకి వచ్చిన వసూళ్ల గురించి ప్రకటించడానికి నిర్మాతలు జంకుతారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ పరమైన ఇబ్బందులు వస్తాయని, రికార్డులు వచ్చినప్పటికీ అఫీషియల్‌గా కలెక్షన్‌ బ్రేకప్‌ ఇవ్వడానికి వెనకాడతారు. ఇంత గ్రాస్‌ వచ్చిందీ, ఇన్ని కోట్లు వసూలు చేసిందీ అంటూ అభిమానుల్ని ఉత్సాహ పరచడానికి నోటి లెక్కలు చెప్తారు కానీ 'సరిగ్గా ఇంత వసూలు చేసింది' అని మాత్రం బల్ల గుద్ది ప్రకటించరు.

కానీ చిరంజీవి పునరాగమనంలో 'ఖైదీ నంబర్‌ 150' చేసిన సంచలనాలని అధికారికంగా ప్రకటించడంలోనే ఆనందం ఉందని చరణ్‌ ఫీలవుతున్నాడు. తండ్రి రీఎంట్రీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన చరణ్‌ ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ నుంచి పబ్లిసిటీ వరకు అన్నిట్లోను తన ముద్ర వేసాడు.

'ఖైదీ నంబర్‌ 150'కి హైప్‌ పెంచడంలో చరణ్‌ పబ్లిసిటీ స్ట్రాటజీ బాగా పని చేసింది. విపరీతమైన పోటీ మధ్య విడుదలై కూడా తొలి వారంలోనే 75 కోట్లకి పైగా షేర్‌ సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చేసిన సంచలనాల గురించి చరణ్‌ ప్రెస్‌మీట్‌ పెడుతున్నాడు.

తాము సైతం ఊహించని రెస్పాన్స్‌ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోన్న మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్న చిరంజీవి ఘనత గురించి అధికారిక లెక్కలతోనే సెలబ్రేట్‌ చేసుకోనుంది. తండ్రి సృష్టించిన సంచలనం ముందు టాక్స్‌ పరమైన ఇబ్బందులేం లెక్క కాదని చరణ్‌ ఈ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ద్వారా నిరూపించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English