పూరి తిక్కకు ల్కె ఉండాలి

పూరి తిక్కకు ల్కె ఉండాలి

తెలుగు ఇండస్ట్రీలో తిక్క ఉంది గబ్బర్‌సింగ్‌కు కాదని, దర్శకుడు పూరి జగన్నాథ్‌కేనని అంటే చాలమంది అవుననే అంటున్నారు. పూరి తిక్క ముందు గబ్బర్‌సింగ్‌లు, బిజినెస్‌మ్యాన్‌లు ఎందుకూ సరపోరట. ఇద్దరమ్మాయిలతో ఆడియో రిలీజ్‌ టైములో పూరి సార్‌కు తిక్కతిక్కగా ఉండేవి నచ్చుతాయి అని దేవిశ్రీప్రసాద్‌ అనడంతో అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు.

 స్టోరి సిట్టింగులకు బ్యాంకాక్‌, హైదరాబాద్‌ ఆఫీస్‌కోసం ఫైవ్‌స్టార్‌ హోటల్లో రూము, విలన్‌ ప్రక్కన ఎప్పుడు భయంతో బ్రతికే అమ్మాయిలు వగైరా పనులన్నీ చేసే పూరిని చూస్తే ఆయనకు తిక్క ఒక రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. కాని క్రియేటివిటీ పాళ్లు కాస్త ఎక్కువగా ఉండే వారందరికీ ఇలాంటి తిక్క ఉంటుందని చెబుతారు. కాకపోతే ఆ తిక్క లెక్కలేకుండా పోయి తొక్కమీద కాలేస్తే ఏమవుతుంది అంటూ సినిమాలు తీస్తే అవి అట్టర్‌ఫ్లాపవుతాయి. అందుకే ఎంత తిక్క ఉన్నా సరే దానిని గబ్బర్‌సింగ్‌ టైపులో లెక్కలోనే ఉంచుకోవాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు