మహేష్ హీరోయిన్ అడ్డంగా దొరికేసింది

మహేష్ హీరోయిన్ అడ్డంగా దొరికేసింది

మహేష్తో '1 నేనొక్కడినే'లో నటించిన క్రితి సనన్ ప్రస్తుతం బాలీవుడ్లో సెటిల్ అయింది. భారీ ఆఫర్లేమీ వచ్చి పడిపోవడం లేదు కానీ క్రితిని టోటల్గా ఇగ్నోర్ అయితే చేయడం లేదు. చేతి నిండా పని లేకపోవడం వల్లనేమో, అమ్మడు లవ్లో పడింది.

ఇటీవలే ధోనీ చిత్రంతో పాపులారిటీ సంపాదించుకున్న సుషాంత్ సింగ్ రాజ్పుట్తో క్రితి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. అయితే తమ అఫైర్ గురించి వీరిద్దరూ ఇన్నాళ్లూ భద్రంగా కాపాడుకుంటూ వచ్చారు. పబ్లిక్లో కలిసి తిరగడం, ఒకరిపై ఒకరు పబ్లిగ్గా ప్రేమ ఒలకబోసుకోవడం లాంటివి అవాయిడ్ చేసారు.

అయితే ఒక్కసారి పొగ వచ్చిందంటే బాలీవుడ్ గాసిప్ మీడియా ఇక వాళ్ల చుట్టూ కోటి కళ్లు పెట్టుకు తిరుగుతుంటుంది. తనని మీడియా గమనిస్తోందనే విషయం తెలియక లేట్ నైట్ కారులో క్రితి సనన్ ఇంట్లోకి వెళుతూ సుషాంత్ కెమెరాలకి దొరికిపోయాడు.

అంత రాత్రి ఆమె ఇంట్లో ఏమి పని అడిగితే ఇక బుకాయించడానికి కూడా ఏమీ ఉండదు కనుక ఈ జంట ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయినట్టే. అయితే ఈ ప్రేమకథ చిరకాలం కొనసాగేదో లేక కొద్ది కాలం పాటు సాగే కాలక్షేప వ్యవహారమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు మరి.