అమ్మడిది గోల్డెన్‌ లెగ్గు

అమ్మడిది గోల్డెన్‌ లెగ్గు

మలయాళ చిత్ర సీమలో అడుగు పెట్టిన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన 'ప్రేమమ్‌' సుందరి అనుపమ పరమేశ్వరన్‌ తెలుగునాట కూడా మొదటి సినిమాతోనే విజయ ఢంకా మోగించింది. 'అఆ'తో బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చిన అనుపమకి రెండవ చిత్రం 'ప్రేమమ్‌'తోను విజయం దక్కింది. ముచ్చటగా మూడవ సినిమా 'శతమానం భవతి' కూడా హిట్టయిపోవడంతో ప్రస్తుతం అనుపమది గోల్డెన్‌ లెగ్‌ అని ఇండస్ట్రీ కీర్తించేస్తోంది.

వరుసగా హిట్లు కొడుతోన్న అనుపమకి ఇప్పుడు డిమాండ్‌ బాగానే వుంది. రీసెంట్‌గా రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల చిత్రంలో ఛాన్స్‌ కొట్టేయడంతో ఆమె స్థాయి కూడా పెరిగింది. ఇంతకాలం మిడ్‌ రేంజ్‌ హీరోలతో చేస్తూ వచ్చిన అనుపమకి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం వచ్చింది. చరణ్‌, సుకుమార్‌ చిత్రం కైవసం చేసుకోవడంతో తాను ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్త పాటిస్తోంది.

ఇకపై చిన్న సినిమాలు ఎక్కువ ఒప్పుకోరాదని, చరణ్‌ చిత్రం ఫలితం వచ్చే వరకు చిన్న బడ్జెట్‌ సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని ఆమెకి ఎవరో గీతోపదేశం చేసారట. వేచి చూడడం వల్ల ఒరిగే ప్రయోజనాలు అర్ధం చేసుకున్న అనుపమ ఇప్పుడు తొందరపడి ఏ సినిమా సైన్‌ చేయడం లేదట. నిజంగా ఆమె లక్కు ఫలించి చరణ్‌ సినిమాతోను హిట్టు కొడితే ఇక పెద్ద సినిమాలన్నీ తన కోసమే క్యూ కట్టేయవూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు